Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గిరిజన వారసత్వాన్ని ప్రపంచ ఫ్యాషన్, జీవనశైలిలో అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యంః కేంద్ర మంత్రి

18 March 2026

Dum Idli Recipe: బ్రేక్ ఫాస్ట్ లో ఇక ఇదే రారాజు! కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ‘స్పైసీ దమ్ ఇడ్లీ’ రెసిపీ..

18 March 2026

Hyderabad: హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!

18 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Weather Today,Rain alert: భయపెడుతున్న వాయుగుండం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ – weather update imd issues red alert for several districts due to very heavy rains in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Weather Today,Rain alert: భయపెడుతున్న వాయుగుండం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ – weather update imd issues red alert for several districts due to very heavy rains in andhra pradesh

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Weather Today,Rain alert: భయపెడుతున్న వాయుగుండం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ – weather update imd issues red alert for several districts due to very heavy rains in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీని వరుణుడు వదలనంటున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారింది.ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని ఏర్పడిన వాయుగుండం.. వాయువ్య దిశగా కదులుతోంది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. చెరువుల్లోకి వరదనీరు చేరుతోంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో తుపాను హెచ్చరికల కేంద్రం ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అలాగే విద్యుత్ శాఖ కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. అవసరమైతే సంప్రదించాలని కోరింది.

మరోవైపు వాయుగుండం ప్రభావంతో సోమవారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్న శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. మరోవైపు ముందుజాగ్రత్తల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్థానిక అధికారులను 08942-240557 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

ఇక పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసిన వాతావరణశాఖ .. ఈ జిల్లాలలోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి మట్టం పెరుగుతోంది. శ్రీశైలం డ్యామ్‌లో 2.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 3.09 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నాగార్జునసాగర్, పులిచింతలలోనూ వరద ప్రవాహం పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, పరివాహక గ్రామాలవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chirala Old Man Wants Wife Share Video,నా భార్య చనిపోయింది.. 45 ఏళ్ల మహిళ కావాలి.. సోషల్ మీడియాలో తాతయ్య రిక్వెస్ట్.. – elderly man posted a video on social media and wants a wife between 45 and 50 years in chirala

18 March 2026

Ashwini Vaishnav On Vizag Railway Zone,విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలపై.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన – railway minister ashwini vaishnav said visakhapatnam railway zone operations will start soon

18 March 2026

Pawan Kalyan Student RTC Bus,బస్సులో ఆ యువకుడు అన్న మాటను.. సులభంగా మర్చిపోలేను: పవన్ కళ్యాణ్ – pawan kalyan shared a conversation with jntu student while traveling rtc bus from mangalagiri to penumaka

18 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
జాతీయం

గిరిజన వారసత్వాన్ని ప్రపంచ ఫ్యాషన్, జీవనశైలిలో అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యంః కేంద్ర మంత్రి

18 March 2026

భారతదేశ గిరిజన కళా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. గిరిజన కళ, సృజనాత్మక సహకారాల నూతన శకానికి…

Dum Idli Recipe: బ్రేక్ ఫాస్ట్ లో ఇక ఇదే రారాజు! కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ‘స్పైసీ దమ్ ఇడ్లీ’ రెసిపీ..

18 March 2026

Hyderabad: హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!

18 March 2026

ఈ రాశుల అమ్మాయిల అదృష్టం షాక్ ఇస్తుంది..! వీరికి దొరికే భర్తలు ఎలా ఉంటారో తెలుసా?

18 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గిరిజన వారసత్వాన్ని ప్రపంచ ఫ్యాషన్, జీవనశైలిలో అగ్రస్థానానికి తీసుకురావడమే లక్ష్యంః కేంద్ర మంత్రి

18 March 2026

Dum Idli Recipe: బ్రేక్ ఫాస్ట్ లో ఇక ఇదే రారాజు! కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ‘స్పైసీ దమ్ ఇడ్లీ’ రెసిపీ..

18 March 2026

Hyderabad: హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!

18 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.