బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. వారి అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. దానిపై విచారించిన ధర్మాసనం.. తాజా ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

