చిన్నప్పుడే కెమెరా పట్టుకుని పోజులిస్తోన్న ఈ బుడతడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి టాలీవుడ్ లో హ్యాండ్సమ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ప్రముఖ కెమెరామెన్ మేనల్లుడు ట్యాగ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాలోనే క్రూరత్వం నిండిన నెగెటివ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కు భిన్నంగా వైవిధ్యమైన కథలతో సినిమాలు తీయడంలో ఈ హీరో ముందుంటాడు. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న ఈ హీరో ఈ మధ్యన తన దాన ధర్మాలతోనూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో మిగతా హీరోల కంటే ఓ మెట్టు ముందే ఉంటున్నారు. మరి అందమైన మనసు ఉన్న ఈ హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. ఈ టాలీవుడ్ హీరో ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి ఓ సూపర్ హిట్ సినిమాలో నటించాడు. మూవీ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు హీరో సందీప్ కిషన్. ఇది అతని చిన్ననాటి ఫొటో.
ప్రముఖ కెమెరామేన్ చోటా కే నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన సొంత టాలెంట్ తో అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010లో ప్రస్థానం హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సందీప్. ఆతర్వాత స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి వంటి సినిమాలు చేశాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సోలో హీరోగా మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రారా కృష్ణయ్య, బీరువా, శమంతకమణి, తెనాలి రామకృష్ణ, నిను వీడని నీడను నేనే, ఏ1 ఎక్స్‌ప్రెస్, గల్లీ రౌడీ, మైఖేల్, ఊరు పేరు భైరవకోన, రాయన్ తదితర సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు.
ఇవి కూడా చదవండి
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సందీప్ కిషన్ టీమ్..
Kuddos to @sundeepkishan anna Team👏🏻
Truly a Great initiative towards everyone…❤️#SundeepKishan #APFloods pic.twitter.com/RWYrkc5ArT
— Anchor_Karthik (@Karthikk_7) September 3, 2024
ఇక తాను నిర్వహిస్తోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్స్ నుంచి రోజూ 350 మంది పేదలకు భోజనాలు అందిస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. ఇటీవల విజయవాడ వరదల్లోనూ సందీప్ కిషన్ టీమ్ బాధితులకు భోజనం, నీళ్లు అందజేశారు.
పేద మహిళ వైద్యానికి 50 వేల సాయం..
Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well ♥️ https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt
— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

