మహారాష్ట్ర అమరావతిలోని ఒక ప్రవేట్ ఆస్పత్రికి 20 రోజుల క్రితం ఆరోగ్య సమస్యలు ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పాప పలు నెలలుగా వాంతులు, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతుందని చెప్పారు. దీంతో పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఉషా గజ్భియే తొలుత జనరల్ టెస్టులు చేసి.. ఆపై పాపకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో బాలిక డాక్టర్‌కు ఒక సీక్రెట్ చెప్పింది. తనకు చిన్నప్పటి నుంచి జుట్టు తినే అలవాటు ఉందని వెల్లడించింది. దీంతో స్కానింగ్ చేయగా, ఆమె కడుపులో పెద్ద హెయిర్ బాల్ ఉన్నట్లు వెల్లడించింది.
అన్ని రిపోర్ట్స్ పరిశీలించి.. తీవ్రతను అంచనా వేసిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చారు. విజయవంతంగా ఆపరేషన్ చేసి.. ఆమె కడుపు నుంచి అర కిలో అంటే దాదాపు 500 గ్రాముల బరువున్న హెయిర్ బాల్ బయటకు తీశారు. ఆపరేషన్ అనంతరం పాప కోలుకుంటుందని.. డాక్టర్ ఉషా గజ్భియే తెలిపారు. చిన్నారికి ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని.. మంచిగానే ఆహారం తీసుకుంటుందన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
ఇలా జుట్టు తినే అలవాటును వైద్య భాషలో ట్రికోఫాజియా అంటారు. ఒత్తిడి, భయం, డిప్రెషన్ వంటి భావోద్వేగాలు కారణంగా కొందరు ఈ పరిస్థితికి చేరుకుంటారు. ఇది ఒక రకమైన డిసార్డర్. తినకూడని పదార్థాలను తినాలనే ఆకర్షణ కలిగి ఉంటారు. సైకాలజికల్ కౌన్సిలింగ్, బెహేవియరల్ థెరపీ ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..