Akividu Digamarru 165 National Highway DPR Update: ఆంధ్రప్రదేశ్‌లో ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణ అంచనా వ్యయం రూ.2500 కోట్లకు చేరింది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చొరవతో అంచనాలు పెరిగాయి. రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. పాలకొల్లు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎత్తును పెంచారు. కొత్త అంచనాలతో డీపీఆర్ సిద్ధమవుతోంది. కేంద్రం ఆమోదం తెలిపితే వెంటనే టెండర్లు పిలుస్తారు. మార్చిలోపు ఆమోదం రాకుంటే ప్రతిపాదన మొదటికి వస్తుంది.
హైలైట్:
- ఏపీలో కొత్త నేషనల్ హైవే అప్డేట్
- కొత్తగా హైవే అంచనాలు పెరిగాయి
- త్వరలోనే కేంద్రానికి కొత్త డీపీఆర్

Chandrababu: కుర్రాడికి క్లాస్ పీకిన చంద్రబాబు.. మంత్రిని చూపిస్తూ, ఆసక్తికర సీన్
అంతేకాదు ఈ హైవేకు సంబంధించి సిమెంట్, స్టీలు, మెటల్, కూలీల ఖర్చులను లెక్కిస్తున్నారు.. ధరలు పెరగడంతో వాటిని బట్టి కొత్త అంచనాలు వేస్తున్నారు. అలాగే కేంద్రం కొత్తగా కొన్ని మార్పులు చెప్పడంతో అంచనా వ్యయం పెరిగింది. ఈ క్రమంలో వ్యయం రూ.2500 కోట్లకు పెరిగింది. ఈ మేరకు మరో వారంలో కొత్త DPRను కేంద్రానికి పంపనున్నారు. కేంద్రం ఆమోదం తెలిపితే వెంటనే టెండర్లు పిలుస్తారు.. ఒకవేళ మార్చిలోపు టెండర్లకు ఆమోదం రాకపోతే, ఈ ప్రతిపాదన మొదటికి వస్తుంది అంటున్నారు.
వాస్తవానికి ఈ హైవేను రెండు లైన్లుగా నిర్మించాలని భావించారు.. కానీ ఆ తర్వాత నాలుగు లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొత్త DPR ఆమోదంపై కేంద్రమంత్రి వర్మ దృష్టి పెడతారని భావిస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలో మార్పులు చేసి పంపుతున్నారు.