
గత కొన్ని రోజులగా హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతాల్లో సంచరిస్తూ.. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారుల చెతుకు చిక్కింది. గత కొన్ని రోజులగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫారెస్ట్ ట్రెక్ పార్కులో సంచరిస్తున్న ఒక చిరుత పులి. గత గురువారం స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కంటపడింది. దీంతో భాయందోళనకు గురైన సదురు అధికారులు ఉన్నాధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు గత వారం రోజులుగా చిరుత ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా చిరుత సంచరిస్తున్న ప్రాంతాల్లో బోన్‌లను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునేందుకు చర్యలను ముమ్మరం చేశారు. అనుకున్న ప్రకారం ఎట్టకేలక్ బయటకు వచ్చిన చిరుత ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోన్‌లో చిక్కుకుంది. దీంతో అధికారులు అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిరుత పులిని బోన్‌లో అలానే తీసుకెళ్లి జూ పార్క్‌లో వదిలేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.