ఇప్పటి నుంచి ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పలు రకాల ప్రయోజనాలు ఇవ్వాలనే పాలసీని రాష్ట్రప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొదటిగా.. మూడో బిడ్డ పుట్టిన తల్లికి నగదు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నారు. నాలుగో బిడ్డ పుడితే కూడా ఆస్తి పన్ను మినహాయింపు లాంటి అనేక ప్రోత్సాహకాలను కొనసాగించాలనేది యోచన. అంతేకాదు.. కొంతమందికి పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉంటాయి. అలాంటి కుటుంబాల కోసం ప్రభుత్వమే ముందుకొస్తోంది. పిల్లలు పుట్టేలా చేసే ఐవీఎఫ్ చికిత్స చాలా ఖరీదైనది. ఒక్కసారి చికిత్సకు దాదాపు తొంభై వేల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఖర్చులో కనీసం కొంత భాగాన్ని ప్రభుత్వమే భరించాలన్నది ముసాయిదాలో పేర్కొన్నారు. ఇది ఎంతోమందికి ఉపయోగపడే నిర్ణయం. పిల్లల్ని చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే. కానీ ఉద్యోగం చేస్తున్న తల్లులైతే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అందుకే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం ఇవ్వాలని, మాతృత్వ సెలవులను ఆరు నెలల నుంచి ఏడాదికి పెంచాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు కూడా ఇది వర్తించాలన్నదే లక్ష్యం. ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చూసుకోవడం చాలామందికి కష్టంగా మారుతోంది. అందుకే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేట్ సంస్థల్లోనూ పిల్లల సంరక్షణ కోసం చిన్న చిన్న కేంద్రాలు అంటే క్రెచ్‌లు ఏర్పాటు చేయాలన్న యోచన ఉంది. వాటిలో పనిచేసేవారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తోంది. ఇప్పుడు ప్రతి కుటుంబం ఒకరు లేదా ఇద్దరితోనే ఆగిపోతోంది. అంతకంటే ఎక్కువమంది పిల్లలు కనడమే కాదు, ఆలోచించడం లేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్ కథ! ది బెస్ట్ డార్క్ థ్రిల్లర్ సిరీస్!
ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??
Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే