శ్రావణ శుక్రవారం వేళ తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్భుత సంఘటన వెలుగు చూసింది. జిల్లాలోని పెద్దబోనాల పెద్దబోనాల పరిధిలో అరుదైన దృశ్యం అందరికీ కనువిందు చేసింది. శివలింగం ఆకారంలో చీమల పుట్ట ప్రత్యక్షమైంది. అచ్చం శివలింగం ఆకారంలో చీమలు పెట్టిన పుట్ట స్థానికుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణ చీమల పుట్టలకు ఇది భిన్నంగా.. శివలింగం ఆకారంలో ఉండటంతో దానిని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడుతున్నారు. గంటల వ్యవధిలోనే విషయం చుట్టు పక్కల గ్రామాలకు కూడా దావాలం వ్యాపించింది. పెద్దబోనాల సమీప ప్రాంత ప్రజలు సైతం దీన్ని చూసేందుకు క్యూకట్టారు. కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్త ఇప్పుడు…నెట్టింట వైరల్‌గా మారింది.