ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో పార్టీ చేసుకున్న ఒక కుటుంబానికి అత్యంత దారుణమైన పార్టీగా నిలిచింది. కుటుంబ సభ్యులు చికెన్ తిన్న వెంటనే ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వాంతులు, విరేచనాల కారణంగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేరారు. చికిత్స అందిస్తున్న సమయంలో అత్త, అల్లుడు మరణించారు. కుటుంబంలోని మిగిలిన ముగ్గురు సభ్యుల పరిస్థితి కూడా విషమంగా ఉంది.
రాజ్‌గమర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోర్కోమా గ్రామంలో ఈ విషాద సంఘటన జరిగింది. అల్లుడు వచ్చిన సంతోషంతో ఇంట్లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చికెన్, మద్యం వడ్డించారు. అయితే ఈ పార్టీ ఆ కుటుంబ సభ్యులకు జీవన్మరణ సమస్యగా మారింది. దర్యాప్తులో ఈ దారుణానికి కారణం ఫుడ్ పాయిజనింగ్ కేసు అని తేలింది. పార్టీలో వడ్డించిన మద్యం కూడా విషపూరితమైనదని చెబుతున్నారు. అయితే.. అసలు కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే తెలుస్తుందని చెబుతున్నారు పోలీసులు.
60 ఏళ్ల రాజ్మీన్ బాయి శివనగర్ చౌహాన్ పారాలో నివసిస్తోంది. రాజ్మీన్ బాయి అల్లుడు దేవ్ సింగ్ గురువారం రాత్రి తన భార్య చమేలితో వచ్చాడు. అల్లుడు కూతురు వచ్చిన ఆనందంలో రాజ్మీన్ బాయి ఆమె కుమారుడు రాజ్ కుమార్ పొరుగున ఉన్న రాజరాజ్ లు కలిసి చికెన్ పార్టీ చేసుకున్నారు. చికెన్ తిన్న తర్వాత మొదటి అత్త రాజ్మీన్ బాయి ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత, అల్లుడి పరిస్థితి దిగజారింది. వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అత్తా అల్లుడు మరణించారు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..