
ఆ రోజు బ్యాంక్‌లో ఎప్పటిలానే క్యాష్ బాక్స్‌లను సిద్దం చేశారు. ఏటీఎంలో క్యాష్ నింపేందుకు ఫుల్ సెక్యూరిటీతో బాక్స్‌లలో నుంచి డబ్బును తీస్తున్నారు. ఈలోగా ఓ క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగా.. బ్యాంక్ సిబ్బందితో పాటు అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు తీసుకొచ్చిన క్యాష్ బాక్స్‌ను ఒక్కసారిగా ఓపెన్ చేయగా.. దెబ్బకు బ్యాంక్ సిబ్బంది షాక్ అయ్యారు. బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు బ్యాంక్ సిబ్బంది. పామును బ్యాంక్ ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఇది చదవండి:
మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్..
బాబోయ్.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..