ఆన్‌లైన్ మొబైల్ గేమింగ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గేమ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. 7వ తరగతి చదువుతున్న జైన్… యుద్ధానికి సంబంధించిన ఫ్రీ ఫైర్ అనే ఆన్ లైన్ గేమ్‌ను తరచూ ఆడేవాడు. మొదట్లో సరదాగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేసిన చిన్నారికి, క్రమంగా గేమింగ్ వ్యసనంగా మారింది. డబ్బును పెట్టుబడి పెట్టి ఆడే గేమింగ్ యాప్స్ అతడిని ఆకర్షించాయి.
మొదట్లో కొంత డబ్బు గెలిచాడు. ఆ తర్వాత పెరిగిన ఆశ, అతన్ని మరింతగా డబ్బు పెట్టేలా చేసింది. మొదట కొద్ది మొత్తంలోనే డబ్బులు పెట్టేవాడు. కానీ, గెలవాలని తపన పెరిగిన కొద్దీ.. పెద్ద మొత్తాల్లో డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మానసిక వేదనకు గురై ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండటాన్ని గమనించాడు, ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను చనిపోయినట్లు ప్రకటించారు. గురువారం(జూలై 31) రాత్రి నగరంలోని MIG పోలీస్ స్టేషన్ పరిధిలోని అనురాగ్ నగర్‌లో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది.
జైన్ మృతితో ఇండోర్‌లో విషాదం నెలకొంది. అయితే మృతుడి తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవ దానం చేయాలని భావించారు. చిన్నారి కళ్లను దానం చేశారు. మరొకరి జీవితంలో వెలుగు నింపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..