గుండెల్లో మంటను తగ్గించుకోవడానికి చాలా మంది ఎక్కువగా మందులను వాడుతుంటారు. కానీ వాటి కంటే ఇంటిలోనే కొన్ని టిప్స్ పాటించడం వలన సహజంగానే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు, యూఎస్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జోసెఫ్ సల్హాబ్. కాగా, ఆయన చెప్పిన ఏడు సహజమైన టిప్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
భోజనం చేసిన తర్వాత షుగర్ ఫ్రీ చూయింగమ్ నమలడం వలన గుండెల్లో మంట తగ్గుతుందంట. దీని వలన లాలాజలం ఉత్పత్తి అయ్యి, ఇది అన్నవాహికలోకి చొచ్చుకపోయి, ఆమ్లాన్ని తటస్థీకరించి, గుండెల్లో మంటను తగ్గిస్తుందంట. భోజనం చేసిన తర్వాత మెడిసన్ వేసుకోవడం కం టే, చూయింగ్ గమ్ నమలడం మంచిదంట.
అలాగే గుండెల్లో మంట సమస్య బాధపెడుతున్నప్పుడు రాత్రి సమయంలో ఎడమ వైపు తిరిగి పడుకోవాలంట. ఇది చాలా మంచి ఫలితం ఇస్తుందని చెబుతన్నారు ఆరోగ్య నిపుణులు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వలన కడుపు, అన్నవాహిక మధ్య జంక్షన్ స్టమక్ ఆమ్లస్థాయి కంటే ఎక్కువగా ఉండటం వలన ఇది రిఫ్లక్స్‌ను తగ్గిస్తుందంట. దీంతో గండెల్లో మంట తగ్గుతుందంట.
అధిక బరువు ఉన్న వారు, శరీర బరువు తగ్గడం వలన కడుపు పై ఒత్తిడి తగ్గి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి, కొన్ని సందర్భాల్లో పూర్తిగా తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన గుండెల్లో మంట సమస్య నయం అవుతుందంట.
ఆల్కహాల్, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ప్రకారం, ఆల్కహాల్, సిగరెట్స్ రెండూ కూడా అన్నవాహికలోని స్పింకటర్స్ సడలిస్తాయంట. దీని వలన అల్సర్లకు కారణం అవుతుందంట. అందుకే వీలైనతం వరకు వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.