Andhra Pradesh Cashless Tax Collection,ఏపీ ప్రజలకు శుభవార్త.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, ఇకపై ఇంట్లో నుంచి ఈజీగా! – andhra pradesh government plans to implement cashless tax collection very soon
AP Govt Cashless Tax Collection: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తోంది. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. నగదు రహితంగా పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. అలాగే ఆన్‌లైన్, వాట్సాప్ ద్వారా పన్నులు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు. పన్నుల విధానంలో పారదర్శకత పెంచడానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో రికార్డులను అప్‌లోడ్ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లలో అవకతవకలు జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
హైలైట్:
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరగక్కర్లేదు
నగదు రహితంగా చెల్లించే అవకాశం
ఏపీ ఆన్‌లైన్‌లో ఆస్తి పన్ను వివరాలు (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియలో మార్పులు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లోనే ఆస్తి పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. నగదు రహితంగా పన్ను వసూళ్లు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్, వాట్సాప్ ద్వారా పన్నులు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు. పన్నుల విధానంలో పారదర్శకత పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో పంచాయతీ రికార్డుల్లో ఉన్న ఇళ్లు, భవనాలు, షాపుల వివరాలను అప్‌లోడ్ చేశారు. ఈ వివరాలను మళ్ళీ సరి చూసే ప్రక్రియ కూడా పూర్తయింది. త్వరలోనే ప్రజలకు కొత్త విధానం అందుబాటులోకి రానుంది.రాష్ట్రంలోని పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆస్తి పన్నుకు సంబంధించి గతేడాది రూ.650 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.750 కోట్లకు పైగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పన్ను వసూళ్లు సరిగా లేవు.. ప్రజల నుంచి ఎంత వసూలు చేశారో, పంచాయతీ బ్యాంకు ఖాతాలో ఎంత జమ చేశారో కూడా కార్యాలయాల్లో సరైన లెక్కల్లేవు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పేరుతో పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ఐటీ విభాగం ఇళ్లు, భవనాలు, ఇతర ఆస్తుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసింది. దీని ద్వారా పన్ను వసూళ్లను పర్యవేక్షించవచ్చు. పంచాయతీల ఆదాయంలో ఆస్తి పన్ను చాలా ముఖ్యమని చెప్పాలి. ఆ దిశగా ప్రభుత్వం పన్నుల విషయంలో అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భవనాల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని సులభతరం చేసింది. తాజాగా పన్ను చెల్లింపుల్ని కూడా మరింత సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ పన్నుల చెల్లింపు కొత్త విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి