రాత్రి రోడ్లపై బర్త్‌డే వేడుకలు పేరుతో నానా రచ్చ చేస్తూ స్థానికులను, వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని నెహ్రూ నగర్‌కు చెందిన వైసిపి యువజన విభాగం అధ్యక్షుడు వినోద్ పుట్టిన రోజు సందర్భంగా గత నెల ముప్పైవ తేదిన అర్ధరాత్రి కొందరు యువకులు కలిసి బర్త్ డే వేడుకులు నిర్వహించారు. నెహ్రూ నగర్‌తో పాటు ఇజ్రాయేల్ పేటకు చెందిన కొంతమంది వినోద్ అనుచరులు పెద్ద ఎత్తున మణిపురం బ్రిడ్జి వద్ద గుమికూడారు. అర్ధరాత్ర సమయంలో క్రాకర్స్ కాలుస్తూ కేక్ కట్ చేశారు. పెద్ద ఎత్తున కాల్చిన బాణాసంచా రోడ్డుపై వెలుతున్న వాహనదారులపై పడింది. దీంతో వాహనదారుడు వినోద్ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఒక్క వాట్సప్ మెసేజ్ తో..
అయితే వినోద్ అనుచరులు అధిక సంఖ్యలో ఉండటంతో ఆ వాహనాదారుడితో వాగ్వివాదానికి దిగారు. అది గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని గుమికూడారు. వాహనదారుడితో పాటు స్థానికులందరూ కలిసి పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సదరు యువకులు రాత్రి వేళల్లో బర్త్‌డే పార్టీలు చేసుకుంటూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనదారుడిపై దాడికి యత్నించిన వినోద్ అనుచరులను గుర్తించారు. అంతేకాకుండా వినోద్ పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్లు డిఎస్పీ అజీజ్ తెలిపారు. రాత్రి వేళల్లో నడిరోడ్లపై బర్త్ డే పార్టీలు చేసుకోవడం నిషేధనమి నిబంధనలు ఉల్లంఘించి పార్టీలు చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎప్పీ తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ఏ చర్యలైనా చట్ట విరుద్దమైనని అటువంటి చట్ట విరుద్ద పనులకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: వామ్మో.! ఈ కిలేడికి ఏకంగా 8మంది భర్తలు.. తొమ్మిదో పెళ్లికి రెడీ అవుతుండగా..
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.