జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ గ్రహం బలంగా ఉంటే వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే ఆగస్టు నెలలో శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇప్పటికీ అదే రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయికతో ద్విద్వాదశ యోగం ఏర్పడబోతుంది. ఇది ఏ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం.
మిథున రాశి : మిథున రాశి వారికి శుక్ర సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. శుక్రగ్రహం అనుగ్రహం వలన వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుందంట. పట్టిందల్లా బంగారమే కానున్నదంట.
మీన రాశి : మీన రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వీరు కోరుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే చాలా రోజులుగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే, భార్యభర్తల మధ్య సమస్యలు తొలిగిపోతాయి.
కుంభ రాశి : కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వీరు ఎంత కష్టతరమైన పనులైనా సరే చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎలాంటి అనారోగ్యసమస్యలు దరి చేరవు, పట్టిందల్లా బంగారమే కానున్నదంట.
వృషభ రాశి : వృషభ రాశి వారికి శుక్ర గ్రహం అనుగ్రహం వలన మంచి ఉద్యోగంలో చేరుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.