ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మాస్ యాక్షన్ హీరోగా విజయ్ యాక్టింగ్ అదరగొట్టాడని… సత్యదేవ్, విజయ్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు మరో హైలెట్ బీజీఎమ్. కథకు తగినట్లు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇరగదీశాడని…ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అదిరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సాధించి అదరగొట్టింది.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..
అయితే కింగ్డమ్ సినిమా విడుదల సమయంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా విజయ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా సూపర్ హిట్ టాక్ రావడంపై సైతం స్పందించింది. మొదటి నుంచి ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్ గా ఉన్న రష్మిక.. అభిమానులతో కలిసి సినిమా చూడాలని అనుకుందట. హైదరాబాద్ ఫేమస్ సింగిల్ స్క్రీన్ లో ఆమె ఈ సినిమాను చూడాలనుకుందట.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
ముందుగా శ్రీరాములు థియేటర్ లో ఆమె ప్లాన్ చేసుకోగా.. సెక్యూరిటీ కారణాలతో ఆమె సినిమా చూసేందుకు నిర్వాహకులు ఒప్పుకోలేదట. దీంతో మరో సింగిల్ స్క్రీన్ థియేటర్ భ్రమరాంబ లో ఈ సినిమాను చూసిందట. అయితే చిత్రాన్ని నేరుగా కాకుండా మారువేశంలో వెళ్లి చూశారట. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ బయటపెట్టారు. ఇప్పుడు విషయం తెలియడంతో విజయ్, రష్మిక ఫ్యాన్స్ సర్ ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..