హిందూ మతంలో పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. పూజ సమయంలో కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇది దేవతలను సంతోషపరుస్తుందని విశ్వసిస్తారు. అలాంటి నియమ నిబంధనాలతో చేసిన పూజ ఫలం అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. పూజ సమయంలో అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తారు. కానీ,
పూజ కోసం వివిధ రకాల సామాగ్రి అవసరం. ఎప్పటికప్పుడు సామగ్రి కొత్తగా కొనుగోలు చేస్తారు..కానీ, ఈ నాలుగు వస్తువులు మాత్రం పాతవి అయినా సరే.. తిరిగి వాటిని వినియోగించవచ్చు అంటున్నారు వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
స్కాంద పురాణంలో గంగాజలం ఎప్పుడూ పాతబడదని పేర్కొన్నారు. అందుకే గంగాజలాన్ని ఏళ్ల తరబడి ఇంట్లో ఉంచుకోవచ్చు..తిరిగి దాన్ని శుద్ధికోసం వినియోగించవచ్చు అంటున్నారు. సంవత్సరాల నాటిదైనా కూడా గంగాజలం చెడిపోదని చెబుతున్నారు.
బిల్వ పత్రికి గ్రంథాలలో చాలా ప్రాముఖ్యత ఉంది. శివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రం కూడా వాడినా వినియోగించవచ్చు. శివలింగంపై బిల్వపత్రం ఓసారి సమర్పించినా మరోసారి అదే పత్రాన్ని శుద్ధి చేసి వేయొచ్చు. శివుడికి ఈ బిల్వపత్రి అంటే చాలా ఇష్టం. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక్క దళం సమర్పించినా కూడా చాలని అంటారు. ఆయుర్వేదంలో, దీనిని ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి కూడా ఉపయోగిస్తారు.
పూజలో పువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవతలు పువ్వులు సమర్పించడం ద్వారా సంతోషిస్తారని నమ్ముతారు. కానీ, శాస్త్రాలలో పాత పువ్వులను సమర్పించడం నిషిద్ధం. అయితే, ఈ నియమం తామర పువ్వుకు వర్తించదని చెబుతున్నారు. తామర పువ్వును కడిగి మళ్ళీ అర్పించవచ్చు అంటున్నారు..తామర పువ్వును కూడా ఒకసారి సమర్పించిన తర్వాత మళ్ళీ కడిగి పూజలో పెట్టొచ్చు అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. తామరపువ్వును ఇలా కడిగి పెడుతూ ఐదు రోజుల వరకూ వాడొచ్చునని సూచించారు.
మత విశ్వాసం ప్రకారం, బిల్వపత్రం, గంగాజలం, తామరతో పాటు తులసి ఆకులు కూడా ఎప్పుడూ పాతబడవు. మీరు పూజలో పాత తులసి ఆకులను కూడా ఉపయోగించవచ్చు. తులసి ఆకులను కూడా శుద్ధి చేసి మళ్లీ మళ్లీ పూజకోసం వినియోగించవచ్చు. విష్ణుపూజలో తులసి తప్పనిసరి…కొత్త ఆకులు దొరికితే పర్వాలేదు లేదంటే వాడిన ఆకులు ఉన్నా పూజలో వాడొచ్చు అంటున్నారు. మీరు దేవుళ్లకు ఉపయోగించిన తులసిని పడవేయాలంటే..పారే నీటిలో పోయాలని చెబుతున్నారు. శుభ్రమైన ప్రదేశంలో వేయాలని చెబుతున్నారు.