చిన్న సినిమాగా వచ్చి నయా రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. స్టార్ హీరోలు, పెద్ద డైరెక్టర్, భారీ సెట్లు ఎలాంటివి లేకుండా వచ్చిన ఆ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఆ సినిమానే మహా అవతార్ నరసింహ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన మహావతార్ నరసింహ సినిమా గురించే మాట్లాడుతున్నారు.
సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం మహావతార్ నరసింహ సినిమా వీడియోలే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద అందరూ ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక మహావతార్ సినిమా కలెక్షన్స్ పరంగాను రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుదలైన ఎనిమిది రోజుల్లోనే దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూల్ చేసింది.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై పై తెరకెక్కిన మహావతార్ నరసింహ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది మహావతార్ నరసింహ. ఇక ఇప్పుడు ఈ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది మహావతారా నరసింహ . కేవలం ఇండియాలనే కాదు అమెరికాలోనూ ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే అక్కడ 1 మిలియన్ డాలర్స్ కు పైగా కలెక్షన్స్ సాధించిందని తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుంది.
ROARING BLOCKBUSTER – The verdict is loud and clear 🔥
Audiences across the nation are embracing #MahavatarNarsimha with overwhelming love ❤️🔥#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan @AshwinKleem @SamCSmusic @MahavatarTales @samaymahajan… pic.twitter.com/gbC4tp6EL7
— Mahavatar Narsimha (@MahavatarTales) July 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.