మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది అన్షు. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. మన్మథుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న అన్షు..
ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంలోనూ కనిపించింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు సినిమాల్లో అన్షు పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత సైతం అలాంటి తరహా పాత్రలే రావడంతో సినిమాలకు దూరంగా ఉండిపోయింది.
15 ఏళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న అన్షు.. ఇటీవలే మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. ఇందులో రావు రమేష్, అన్షు కీలకపాత్రలు పోషించారు.
సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత లండన్ కు చెందిన సచిన్ సగ్గార్ ను వివాహం చేసుకుంది. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లో రాణించాలని చూస్తుంది.
కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో తన అందంతో కవ్వించింది అన్షు. వయసు పెరిగినా ఈ బ్యూటీ అందం మాత్రం తగ్గడం లేదు అని కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ట్రెడిషనల్ డ్రసింగ్ లో అదరగొట్టింది.