Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు..

3 August 2025

Video: తన సమాధిని తానే తవ్వకుంటున్న ఇజ్రాయెల్‌ బంధీ..! కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

3 August 2025

Parenting Tips: మీ పిల్లలు ఏదీ గుర్తుంచుకోవడం లేదా..? ఇలా చేయండి.. మెమోరీ పవర్ డబుల్..

3 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Grievance August 3,అన్నదాతా సుఖీభవ నిధుల జమ కాలేదా.. అయితే ఇలా చేయండి.. ఆగస్టు 3 నుంచే – annadata sukhibhava farmers not get funds will complaint from 2025 aug 3rd
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Grievance August 3,అన్నదాతా సుఖీభవ నిధుల జమ కాలేదా.. అయితే ఇలా చేయండి.. ఆగస్టు 3 నుంచే – annadata sukhibhava farmers not get funds will complaint from 2025 aug 3rd

.By .3 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Grievance August 3,అన్నదాతా సుఖీభవ నిధుల జమ కాలేదా.. అయితే ఇలా చేయండి.. ఆగస్టు 3 నుంచే – annadata sukhibhava farmers not get funds will complaint from 2025 aug 3rd
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆగష్టు 2న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేశారు. అయితే కొంతమంది రైతుల ఖాతాలో నిధులు జమ కాలేదు. అలాంటి వారి కోసం అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నిధులు జమ కాని రైతులు అందుకు కారణాలు తెలుసుకొని, సమస్యలు పరిష్కరించుకుంటే నిధులు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు 3 అనగా నేటి నుంచే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆ వివరాలు..

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్ రైతులకు అలర్ట్
  • అన్నదాత సుఖీభ నిధులు జమ కాని వారికి సూచన
  • ఆగస్టు 3 నుంచి ఫిర్యాదుల స్వీకరణ
అన్నదాత సుఖీభవ నిధులు రాలేదా..
అన్నదాత సుఖీభవ నిధులు రాలేదా.. (ఫోటోలు– Samayam Telugu)

ఏపీ రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2, శనివారం నాడు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడత రూ.7 వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. సుమారు 99. 98 శాతం మంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల జమ చేశామని అధికారులు తెలిపారు. మిగిలిన వారికి వివిధ కారణాల వల్ల నిధుల జమ ప్రక్రియ ఆగిపోయిందని వెల్లడించారు. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత కలిగి ఉండి.. నిధులు జమ కాని రైతుల కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. వీరంతా ఆగస్టు 3 అనగా నేడు ఆదివారం నుంచి అభ్యంతరాలు, సవరణలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆ వివరాలు.. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం తొలి విడతలో భాగంగా శనివారం నాడు సీఎం చంద్రబాబు నాయుడు రూ.7 వేలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీని గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 44.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. మిగిలిన రైతులకు అనేక కారణాల వల్ల అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఆగిపోయిందని చెప్పారు. ఈకేవైసీ సమస్యలు ఉన్న వారు వాటిని పరిష్కరించుకుంటే పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. అలానే ఎన్‌పీసీఐలో చురుగ్గాలేని, మ్యాప్‌ కాని అకౌంట్‌లను.. బ్యాంకుకు వెళ్లి యాక్టివ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్పుడు వీరి ఖాతాలో కూడా నగదు జమవుతుందని తెలిపారు.

అయితే నిధులు జమ కాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. అసలు సమస్య ఏంటి.. ఎందుకు నిధులు జమ కాలేదో తెలుసుకుని.. ఆసమస్యలను పరిష్కరించుకోవాలని.. ఆ తర్వాత వారి ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు తిరస్కరణకు గురైన రైతులు.. గ్రామ రైతు సేవా కేంద్రాల్లో కంప్లైంట్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈకేవైసీ సమస్యలు, ఎన్‌పీసీఐలో ఖాతాలు సక్రమంగా లేని వారు, ఎన్నికల నియమావళి, భూయజమానులు చనిపోయాక వారసులు పాసు పుస్తకాలు పొందడంలో ఆలస్యం అయిన వారు, వెబ్ ల్యాండ్, మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, మైనర్లు, 10 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని అధికారులు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా అందించే రూ.6,000లకు అదనంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14000 కలిపి.. మొత్తం రూ.20,000లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఇక ఈ పథకం ద్వారా ఏపీలో ప్రతి సంవత్సరం 46,85,838 మంది రైతులకురూ.20 వేల చొప్పున లబ్ధి చేకూరుతుంది.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి