Tirumala TTD Cancelled Arjitha Sevas: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నాలుగు రోజుల పాటూ ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 5 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవల్ని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రతి ఏడాది పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే దోషాల వల్ల పవిత్రతతకు ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
హైలైట్:
- తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు
- నాలుగు రోజుల పాటూ నిర్వహిస్తారు
- నాలుగు రోజులు ఆర్జిత సేవలు రద్దు

శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు
‘తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 6 నుండి 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 7న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 8న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం చేపడతారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు’ అని తెలిపారు.
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు
‘తిరుపతి శ్రీ కోదండరామస్వామివారికి శనివారం సాయంత్రం బెంగళూరుకు చెందిన దాత బంగారు తులసి హారం బహుకరించారు. రూ.26 లక్షల విలువైన 257 గ్రాముల బంగారు తులసి దళాలపై గాయత్రి బీజాక్షరాలు చెక్కబడిన హారంను దాత ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తఆనంద కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు’ అని టీటీడీ తెలిపింది.