Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Sara Tendulkar : సచిన్ కూతురంటే మినిమం ఉంటది.. ఆ మాత్రం లేకపోతే పరువు పోదా?

4 August 2025

కలెక్టర్ అవ్వాలని కలలుకన్నది.. కట్ చేస్తే హీరోయిన్ అయ్యింది.. అందంలో అప్సరస ఈ భామ

4 August 2025

దారుణం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను చంపేసిన మ‌హిళ‌.. గుర్తు పట్టకుండా ఉండేందుకు ఏం చేశారంటే…

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Kumki Elephants Operation Success,ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్ – kumki elephants first operation success near palamaner chittoor district andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Kumki Elephants Operation Success,ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్ – kumki elephants first operation success near palamaner chittoor district andhra pradesh

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Kumki Elephants Operation Success,ఏపీలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, తొలి సక్సెస్‌తో ఫుల్ జోష్ – kumki elephants first operation success near palamaner chittoor district andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Kumki Elephants First Operation Success: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు.. ఎన్నో ఏళ్ల సమస్యకు చెక్ పెట్టారు. ఈ మేరకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని ఏపీకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏనుగులతో తొలి ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఏనుగుల గుంపును కట్టడి చేసి తిరిగి అడవిలోకి జాగ్రత్తగా తరిమేశారు.

హైలైట్:

  • ఏపీలో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్
  • పలనమేరు దగ్గరలో నిర్వహించారు
  • ఆపరేషన్ సక్సెస్ చేసిన కుంకీలు
ఏపీ కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్
ఏపీ కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్‌లో కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. మొట్ట మొదటిసారిగా చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కుంకీ ఏనుగులు గస్తీ నిర్వహించాయి. పలమనేరు అడవిలో 8 ఏనుగుల గుంపు తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకీ ఏనుగులను ఆ ప్రాంతానికి తరలించారు. కుంకీ ఏనుగుల్ని తీసుకెళ్లారు.. శిక్షకులు వాటికి తగిన సూచనలు చేశారు. టేకుమంద ప్రాంతంలో ఏనుగుల గుంపు కనపడింది.. కుంకీ ఏనుగులు వాటిని పంట పొలాల వైపు రాకుండా అడ్డుకున్నాయి.. వాటిని అడవిలోకి మళ్లించాయి. గుంపులో ఒక చిన్న ఏనుగు (గున్న ఏనుగు) ఉండటంతో మళ్లించడం కష్టమైందని పలమనేరు డీఎఫ్‌వో వేణుగోపాల్ తెలిపారు. చిత్తూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అలాగే పంటల్ని కాపాడుకునే ప్రయత్నంలో పొలాల వైపు వెళ్లిన రైతులపై కూడా దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ క్రమంలో ఏనుగుల్ని కట్టడి చేయడానికి కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.. వెంటనే కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఏనుగుల్ని తీసుకొచ్చారు. వీటిని కర్ణాటక నుంచి పలమనేరులోని ఎలిఫెంట్ హబ్‌కు తరలించి అక్కడ కర్ణాటకకకు చెందిన మావటిలతో శిక్షణ ఇప్పించారు.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మావటీలకు వాటి సంరక్షణ బాధ్యతల్ని చూస్తున్నారు. తాజాగా కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం అయ్యింది.

గతవారం తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. ఈ క్రమంలో శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని తిరుపతి సబ్ డీఎఫ్‌వో సూచించారు. భాకరాపేట ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్‌(ఈటీఎఫ్‌)తో కలిసి శ్రీవారి మెట్టు మార్గంలో పర్యటించారు. రంగంపేట దగ్గరలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర 10 ఏనుగుల గుంపును ఈటీఎఫ్‌ గుర్తించింది. అవి పంటలపై దాడి చేశాయని కూడా కనుగొన్నారు. భద్రత కోసం బుధవారం ఉదయం 6 గంటలకు శ్రీవారిమెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఏనుగులను అడవిలోకి పంపిన తర్వాత, ఉదయం 7 గంటలకు భక్తులను తిరిగి అనుమతించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు.. అధికారులకు కొన్ని సూచనలు చేశారు.

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపుల సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేయడం, ఒక రైతు మరణించడం వంటి ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ శాఖ సిబ్బంది గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు ఆయనకు వివరాలు అందించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల గుంపులు ఎక్కువగా తిరుగుతున్నాయని.. దీనిపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆయన అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏనుగుల గుంపుల కదలికలు, పంట నష్టం, రైతు మరణం వంటి విషయాలపై సమీక్షించారు.

AP Kumki Elephants: పలమనేరుకు చేరుకున్న కుంకీ ఏనుగులు

చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు పొలాలను నాశనం చేశాయని.. ఈ ఘటనపై అధికారులు పవన్ కళ్యాణ్‌కు సమాచారం ఇచ్చారు. కళ్యాణి డ్యామ్ దగ్గరలోని సత్యసాయి ఎస్టీ కాలనీ వద్ద పొలాలు, తోటలను తొక్కివేశాయని.. ఏనుగుల కదలికలను డ్రోన్ కెమెరాల ద్వారా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాలి. ఏనుగులు ఏ మార్గంలో వెళ్లే అవకాశం ఉందో గుర్తించి, ఆ గ్రామస్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికోసం గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, ముందుగా హెచ్చరికలు పంపాలి’ అని పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మొత్తానికి
అడవి ఏనుగులు పంటల వైపు రాకుండా కుంకీ గజరాజులు అడ్డుకున్నాయి.. తొలి మిషన్ సక్సెస్ కావడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి