Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mrunal Thakur: సింపుల్‌గా కనిపించినా.. తన బర్త్‌ డే పార్టీలో మృణాళ్ ధరించిన ఈ డ్రెస్ ఎన్ని లక్షలో తెలుసా?

4 August 2025

COOLIE Pre-Release Event: రజినీకాంత్ గారిని చూసి చాలా నేర్చుకున్నా : నాగార్జున

4 August 2025

వంటలకు మాత్రమే కాదు.. బట్టలకు కూడా వెనిగర్ తో మస్తు లాభాలు ఉన్నాయి..!

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tdp Mla Naseer Video Viral Social Media,ఓ మహిళతో టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్.. సోషల్ మీడియాలో వైరల్, ఇంతకీ ఎవరామె? – tdp mla mohammed naseer video call with a woman goes viral
ఆంధ్రప్రదేశ్

Tdp Mla Naseer Video Viral Social Media,ఓ మహిళతో టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్.. సోషల్ మీడియాలో వైరల్, ఇంతకీ ఎవరామె? – tdp mla mohammed naseer video call with a woman goes viral

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tdp Mla Naseer Video Viral Social Media,ఓ మహిళతో టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్.. సోషల్ మీడియాలో వైరల్, ఇంతకీ ఎవరామె? – tdp mla mohammed naseer video call with a woman goes viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tdp Mla Mohammed Naseer Video Viral Social Media: ఏపీలో మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. రెండున్నర నిమిషాల పాటూ ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడిన వీడియో ఇది. అయితే ఆమె టీడీపీకి చెందిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నసీర్ స్పందించాల్సి ఉంది.

హైలైట్:

  • వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే నసీర్
  • మహిళతో వీడియో కాల్‌ మాట్లాడుతూ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్
టీడీపీ ఎమ్మెల్యే వీడియో కాల్ (ఫోటోలు– Samayam Telugu)

గుం­టూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో మా­ట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఒక మహి­ళతో ఎమ్మెల్యేతో వీడియోలో సైగలు చేస్తూ కనిపించారు. ఎమ్మెల్యే మహమ్మద్‌ నసీర్‌ తన కార్యాలయంలో ఉండగా.. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా వీడియో కాల్‌చేసి మా­ట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో రెండున్నర నిమిషాల వరకు ఉంది. ఆ వీడియోలో ఆడియో వినపడటం లేదు.. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.. అసలు మహిళ ఎవరు.. నసీర్ వీడియో కాల్‌లో ఏం మాట్లాడారన్నది క్లారిటీ లేదు. ఆమె గతంలో టీడీపీ కార్పొ­రేటర్‌ పదవికి పోటీ చేసిన మహిళ అంటూ ప్రచారం జరుగుతోంది.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదంపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ స్పందించాల్సి ఉంది.కొన్ని నెలల క్రితం మరో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఓ మహిళతో ఏకాంతంగా గడుపుతున్నట్లుగా వీడియోలు వైరల్ అయ్యాయి.. అయితే ఆ తర్వాత ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే ఈ వివాదంపై వీడియోలో ఉన్న మహిళ హైకోర్టును ఆశ్రయించారు.. అయితే ఆ వెంటనే ఆమె తన పిటిషన్‌ను వెనక్కు తీసుకోవడంతో ఈ వివాదం ముగిసింది. తాజాగా మహమ్మద్ నసీర్ వివాదంలో చిక్కుకున్నారు.

మహమ్మద్ నసీర్ టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటిచేసి ఓడిపోయారు.. మళ్లీ 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాదు ఇటీవల నసీర్‌ను ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి 2025-26కి ఉభయ సభల సంయుక్త కమిటీలలో మైనారిటీ వర్గాల సంక్షేమ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. వక్ఫ్ బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్నారు.

జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ అనంతబాబులు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు. వీరు కూడా మహిళలతో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా కుట్రని ఆ ఇద్దరు నేతలు కొట్టిపారేశారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల్ని కూడా అలాంటి వివాదాలు వెంటాడుతున్నాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి