Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: భీకరంగా రెండు ఎద్దుల పొట్లాట! స్కూటీతో మధ్యలోకి వచ్చిన అమ్మాయి..

4 August 2025

వరదలో కొట్టుకుపోయిన ట్రాక్టర్ తర్వాత ఏమైందంటే?

4 August 2025

Health Tips: పంటి నొప్పి ఆ భయంకర వ్యాధికి సంకేతమా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

4 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Darshan Que Line Thefts,తిరుమల దర్శన క్యూలైన్లలో సిగ్గు లేకుండా ఇవేం దరిద్రపు పనులు.. సీసీ ఫుటేజ్‌చూస్తే, పాపం భక్తులు – police arrested six interstate thieves for thefts in tirumala darshan que lines
ఆంధ్రప్రదేశ్

Tirumala Darshan Que Line Thefts,తిరుమల దర్శన క్యూలైన్లలో సిగ్గు లేకుండా ఇవేం దరిద్రపు పనులు.. సీసీ ఫుటేజ్‌చూస్తే, పాపం భక్తులు – police arrested six interstate thieves for thefts in tirumala darshan que lines

.By .4 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Darshan Que Line Thefts,తిరుమల దర్శన క్యూలైన్లలో సిగ్గు లేకుండా ఇవేం దరిద్రపు పనులు.. సీసీ ఫుటేజ్‌చూస్తే, పాపం భక్తులు – police arrested six interstate thieves for thefts in tirumala darshan que lines
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Tirumala Darshan Que Line Theft Gang Arrested: తిరుమల వెళ్లే భక్తులు అలర్ట్‌గా ఉండాలి.. దర్శనం క్యూలైన్లలో వెళుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం క్యూలైన్లలో చోరీలు చేస్తున్న ఓ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ భక్తుల మెడలలో బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బంగారాన్ని పోీలసులు స్వాధీనం చేసుకున్నారు.

హైలైట్:

  • తిరుమలలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
  • సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగుర్ని అరెస్ట్ చేశారు
  • క్యూలైన్లలో భక్తుల దగ్గర బంగారం చోరీ
తిరుమల దర్శనం క్యూలైన్లలో దొంగతనాలు
తిరుమల దర్శనం క్యూలైన్లలో దొంగతనాలు (ఫోటోలు– Samayam Telugu)

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అయితే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్న భక్తులకు ముఖ్యమైన గమనిక.. క్యూలైన్లలో వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త గ్యాంగ్ క్యూలైన్లలో చొరబడుతున్నట్లు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలోకి వస్తారు.. అయితే ఓ గ్యాంగ్ భక్తులతో కలిసిపోతున్నాయి. భక్తుల్ని టార్గెట్ చేసి క్యూ లైన్లలో వారి మెడలోని బంగారు ఆభరణాలను, విలువైన వస్తువుల్ని చోరీ చేస్తున్నారు. ఇటీవల చోరీలు జరగడంతో కొందరు తిరుమలలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు.తిరుమల పోలీసులు కేసులు నమోదు చేసి ఈ గ్యాంగ్ కోసం గాలించారు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగుర్ని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరు భక్తుల బంగారాన్ని దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలగా గుర్తించారు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. దొంగల దగ్గర నుంచి 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో, కొండపై భక్తుల భద్రతే తమకు ముఖ్యమని.. చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తిరుమల పోలీసులు. భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

తిరుమలలో ఏఐ విధానంపై మాజీ ఈవో, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ‘తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూకాంప్లెక్సు లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టి లో పెట్టుకొని ఉచితంగా గూగుల్ / టిసిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాత ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలక మండలి ముందుకు వెళ్ళుచున్న సమయంలో విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి టిటిడి లో ఈఓగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం భాధాకరం.. శ్రీవారిని‌ క్షణ కాలం పాటు దర్శించుకునేందుకు సామాన్యభక్తులు ఎదుర్కుంటున్న జాప్యాన్ని, ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా సాధ్యమైనంత త్వరితగతిన భక్తులు స్వామివారి దర్శనం పూర్తి చేసుకునేలా.. ఏఐ సాంకేతికత సహకారం అందించేందుకు గూగుల్ /టిసిఎస్ తదితర ప్రముఖ సంస్థలు పనిచేస్తున్నాయి’ అన్నారు.

తిరుమల శ్రీవారి సేవలో సూర్య జ్యోతిక దంపతులు.. కూతుర్ని చూశారా..?

‘ఇలాంటి తరుణంలో.. భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా, ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న మీరు.. తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా.. భక్తులను గంటలు, రోజులు తరబడి షెడ్లలో, కంపార్టమెంట్లలో బంధించి భక్తులు పడిగాపులు కాయడం మంచిదా..? భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ ను తీసుకురావాలని నిర్ణయించాము. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్న తరుణంలో టీటీడీ కూడా ఏఐ టెక్నాలజీ వాడడంలో ఎలాంటి తప్పు లేదు ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. పూర్తిగా ఖండిస్తున్నాను’ అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి