AP Weather Today: ఏపీలో గత నెలలో కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి.. గత ఒకటి, రెండు రోజులుగా వానలు మళ్లీ ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షలు కురుస్తున్నాయి.. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కొనసాగుతంది. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయంటున్నారు. వచ్చే మూడు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణశాఖ అధికారుల.
హైలైట్:
- ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక
- మూడు రోజుల పాటూ వర్షాలు
- ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలి

‘మంగళవారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పిడుగుపాటు సమయంలో చెట్ల క్రింద ఉండరాదని హెచ్చరించింది. ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి నెల్లూరు జిల్లా వెలగపాడులో 73మిమీ, చిత్తూరు జిల్లా యడమర్రిలో 67మిమీ, నెల్లూరు జిల్లా గుడ్లదోనలో 57.5మిమీ కాకినాడ జిల్లా కరపలో 51మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన భారీ వాహనాలు
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 97.6 మిల్లీ మీటర్లు, నంద్యాల జిల్లా కోయిలకుంట్లలో 65.8, ప్రకాశం జిల్లా పొదిలిలో 65.4, పార్వతీపురంలో 64.5, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 61.2, చిత్తూరు జిల్లా పుంగనూరులో 52.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం జిల్లా కొమరాడలో 40, విజయనగరం జిల్లా బొబ్బిలిలో 40 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.