బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అయితే.. ఇటీవలే బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకుని పరుగులు పెడుతున్నాయి.. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో రేట్లు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. బంగారం ధర తాజాగా.. లక్ష రెండు వేలు దాటింది. అయితే లక్ష దాటి చాలా రోజులైనా.. దాని రేటు అక్కడక్కడే తిరుగుతోంది. ఇప్పుడు పండగ సీజన్ వచ్చేసింది. వ్రతాలు, నోములు చాలా ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజీల కాలం కావడంతో.. బంగారానికి డిమాండ్ కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది. దీంతో గోల్డ్ రేట్ మరింత ప్రియమవుతుందనే టాక్ నడుస్తోంది. ఇప్పుడే త్వరపడండి.. లేకుంటే రేటు పోటు తప్పదంటున్నారు ఎక్స్‌పర్ట్స్..
దేశియంగా మంగళవారం ఉదయం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి..
- 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 820 పెరిగి.. రూ.1,02,220కి చేరుకుంది.
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.93,700 లకి చేరుకుంది..
- ఇక వెండి కిలో ధర రూ.2000 లు పెరిగి రూ.1,15000 చేరుకుంది.
అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,02,220 ఉంటే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,700 ఉంది. కిలో వెండి ధర రూ.1,25,000 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,700 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,25,000 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,370, 22 క్యారెట్ల ధర రూ.93,850 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,15,000 లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,700 ఉంది. వెండి ధర కిలో రూ.1,15,000 గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,220 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,700 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,25,000 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,02,220, 22 క్యారెట్ల ధర రూ.93,700 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,15,000 లుగా ఉంది.
గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..