Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ap Free Gas Cylinder Subsidy Money Not Credited,Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. ఇలా చేస్తే అకౌంట్‌లోకి డబ్బులు.. మంత్రి కీలక ప్రకటన – andhra pradesh minister nadendla manohar gives clarity on free gas cylinder deepam 2 scheme beneficiaries on subsidy money

6 August 2025

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకోకుండా మంచి ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

6 August 2025

రక్షాబంధన్: మీ సోదరీమణులను ఆశ్చర్య పరచడానికి వెళ్ళాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఇవే!

5 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rajam Pet Dog Issue Suicide Attempt,అయ్యో ..పెంపుడు కుక్క ఎంత పనిచేసింది.. యజమాని ఆత్మహత్యాయత్నం – pet dog issue escalates into a fight between two persons leading to one man attempting suicide in rajam
ఆంధ్రప్రదేశ్

Rajam Pet Dog Issue Suicide Attempt,అయ్యో ..పెంపుడు కుక్క ఎంత పనిచేసింది.. యజమాని ఆత్మహత్యాయత్నం – pet dog issue escalates into a fight between two persons leading to one man attempting suicide in rajam

.By .5 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rajam Pet Dog Issue Suicide Attempt,అయ్యో ..పెంపుడు కుక్క ఎంత పనిచేసింది.. యజమాని ఆత్మహత్యాయత్నం – pet dog issue escalates into a fight between two persons leading to one man attempting suicide in rajam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Rajam Pet Dog Issue Suicide Attempt: కుక్క రెండు ఇళ్ల మధ్య గొడవకు కారణమైంది.. రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కుక్క యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. బ్లేడుతో గొంతు కోసుకోవడంతో.. బాధితుడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సమయానికి వైద్యం అందించడంతో ప్రాణాలకు ప్రమాదం తప్పింది.. బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కుక్క ఏం చేసింది.. అసలు గొడవకు కారణం ఏంటి అంటే..

హైలైట్:

  • విజయనగరం జిల్లా రాజాంలో ఘటన
  • కుక్క తీసుకొచ్చి గొడవతోనే సమస్య
  • బ్లేడ్‌తో గొంతు కోసుకున్న యజమాని
రాజాంలో పెంపుడు కుక్క తెచ్చిన తంటా
రాజాంలో పెంపుడు కుక్క తెచ్చిన తంటా (ఫోటోలు– Samayam Telugu)

పెంపుడు కుక్క చేసిన చిన్న పనికి యజమాని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా రాజాంలోని గాయత్రీ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క ఇటీవల కాలంలో పక్కనే ఉండే ఇంటికి వెళ్లి మలవిసర్జన చేస్తోంది. ఆ ఇంటి యజమాని కుక్క యజమానిని ఒకటి, రెండుసార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మళ్లీ ఆదివారం రాత్రి కూడా కుక్క అదే మాదిరిగా చేయడంతో ఆ ఇంటి యజమాని కుక్క యజమానిని నిలదీశారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ వరకు వెళ్లింది. ఆ తర్వాత స్థానికులు గొడవ వద్దని చెప్పి ఇద్దర్ని అక్కడి నుంచి పంపించారు.ఈ క్రమంలో కుక్క యజమాని దీనిని అవమానంగా భావించారు.. పాపం మనస్తాపంతో క్షణికావేశంలో బ్లేడుతో తన గొంతు కోసుకున్నారు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు గమనించారు.. స్థానికుల్ని పిలిచి వెంటనే 108తో పాటుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో పోలీసులు జీపు అక్కడికి చేరుకోవడంతో.. అందులో అతడ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ డాక్టర్లు వైద్యం అందించగా.. ప్రాణాపాయం లేదని చెప్పారు.. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదన్నారు పోలీసులు. అయితే బ్లేడుతో గొంతు కోసుకున్న కుక్క యజమాని మానసికపరమైన చిన్న సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. పాపం పెంపుడు కుక్క విషయంలో మొదలైన చిన్న గొడవ ఒకరి కారణం కావడం చర్చనీయాంశమైంది.

భోగాపురంలో ట్యూషన్ టీచర్ అరాచకం

మరోవైపు భోగాపురం సమీపంలో ట్యూషన్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారయత్నం కలకలం రేపింది. విజయనగరానికి చెందిన విజయ్‌కుమార్, మరో మహిళ కలిసి కొంతకాలంగా ఓ ఊరిలో ట్యూషన్ నడుపుతున్నారు. అయితే ట్యూషన్‌కు లేడీ టీచర్ రాకపోవడంతో విజయ్‌కుమార్ మూడో తరగతి విద్యార్థినిని గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఇంతలో ట్యూషన్‌కు ఎవరో రావడంతో బాలిక తప్పించుకుంది. బాలిక భయపడుతుండటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు.. అప్పుడు బాలిక అసలు విషయం చెప్పింది. ఈ క్రమంలో స్థానికులు విజయ్‌కుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.. కేసు నమోదు చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి