Srikakulam District Special Video: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కీలక ప్రకటన చేశారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వీడియోల పోటీ నిర్వహిస్తున్నారు. అభివృద్ధి, ప్రత్యేకతలపై అవగాహన కల్పించే వీడియోలను తయారు చేయాలని ఆయన కోరారు. సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ఈ పోటీ ఉంటుంది. వీడియో మూడు నిమిషాల నిడివి కలిగి ఉండాలి. ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటలలోపు వీడియోలను పంపాలి.
హైలైట్:
- శ్రీకాకుళం జిల్లా యువతకు అద్భుత ఛాన్స్
- 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా మరో అవకాశం
- రూ.25వేలు గెలుచుకునే అవకాశం ఉంది

శ్రీకాకుళంలో జడ్పీ మీటింగ్ హాల్‌లో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇతర అధికారులు వినతులు స్వీకరించగా.. మొత్తం 140 అర్జీలు వచ్చాయి. ఈ సమస్యల్ని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 48 అర్జీలు వచ్చాయి. కొత్తూరు మండలం కర్లెమ్మకు చెందిన వృద్ధురాలు భూ సమస్య పరిష్కారం కావడం లేదని సంచిలో పురుగు మందు డబ్బా పెట్టుకుని వచ్చారు. మరోవైపు రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని.. యూరియా కొరత నివారించాలని వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్‌ను కోరారు. పోలీసులు తనిఖీలు చేసి డబ్బాను లాక్కొని ఆమెను కలెక్టర్ దగ్గరకు పంపించారు.. ఆమె తన సమస్యను వివరించారు.. ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు.
గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!
ఏపీకి మరో కొత్త ఎయిర్‌పోర్ట్ వస్తోంది.. అక్కడే 1200 ఎకరాల్లో, ఆ జిల్లా దశ తిరిగినట్లే
ఏపీకి మరో కొత్త నేషనల్ హైవే.. ఏకంగా 200 కిలోమీటర్లు, ఈ మూడు జిల్లాల దశ తిరిగినట్లే