ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన మహిళ ఖాతాలో అకస్మాత్తుగా రూ. 1.13 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. రెండు నెలల క్రితం చనిపోయిన గాయత్రి దేవి బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.1.13 లక్షల కోట్లు జమ అయినట్టుగా బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది. చనిపోయిన మహిళ కుమారుడు దీపక్‌కు మొబైల్ యాప్‌లో దీని గురించి సమాచారం అందింది. వెంటనే అతడు సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా, ఖాతా స్తంభింపజేసినట్లు అధికారులు అతనికి చెప్పారు.
ఆగస్టు 3వ తేదీ ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 (ఒక లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలకు పైగా) డబ్బులు జమ అయినట్లుగా చూపించింది. ఆ మెసేజ్ చూసిన దీపక్‌కు ఏమీ అర్థం కాలేదు.. తొలుత ఈ సంఖ్యలో ఉన్న సున్నాలను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. చుట్టుపక్కల వారికి ఆ మెసేజ్ చూపించాడు.. వారంతా నిజంగానే మీ అమ్మ ఖాతాలో లక్షల కోట్లు జమయ్యాయని చెప్పగా అతడు మరింత షాక్ అయ్యాడు. ఆ మర్నాడు ఉదయాన్నే దీపక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖకు వెళ్లాడు. ఇది చూసిన బ్యాంకు అధికారులు కూడా నివ్వెరపోయారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరగడం అసాధారణం కావడంతో.. వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేసి, ఈ విషయాన్ని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
नोएडा में 20 साल के दीपक के कोटक महिंद्रा बैंक खाते में 36 डिजिट की धनराशि आई है।
ये रकम 1 अरब 13 लाख 56 हजार करोड़ रुपए बैठती है।
मेरा गणित थोड़ा कमजोर है। बाकी आप लोग गुणा-भाग कर सकते हैं।
फिलहाल इनकम टैक्स विभाग जांच कर रहा है। बैंक खाता फ्रीज कर दिया गया है। pic.twitter.com/cLnZdMKozD
— Sachin Gupta (@SachinGuptaUP) August 4, 2025
ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారింది. ఆదాయపు పన్ను శాఖ దీనిపై దర్యాప్తు చేస్తోంది. అసలు ఈ డబ్బు ఎవరిది, ఎందుకు వచ్చిందో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో, ఎవరు జమ చేశారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి