TTD Suspends Two Employees For Misconduct: టీటీడీ నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. నిబంధనలు అతిక్రమించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ఇద్దరిని సస్పెండ్ చేశారు.. మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆఫీస్ సబార్డినేట్ శంకర్‌ను సస్పెండ్ చేశారు.. జూనియర్ అసిస్టెంట్ రామును కూడా సస్పెండ్ చేశారు. ఆలయంలోకి ప్రవేశించడానికి గల కారణాలు తెలియజేయాలని ఈ ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరికొందరిపైనా చర్యలు తప్పవంటున్నారు.
హైలైట్:
- టీటీడీ ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసింది
- మరో ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ
- మరికొందరిపైనా త్వరలోనే చర్యలకు ఛాన్స్

వీరిద్దరితో పాటుగా తిరుపతిలో రాజకీయ నాయకులకు సేవ చేసినందుకు జూనియర్ అసిస్టెంట్ చీర్ల కిరణ్‌కు ఛార్జ్ మెమో ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు నిబంధనలు తప్పితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తిరుమల కల్యాణకట్టలో పనిచేసే వెంకీపురం పవన్‌కుమార్, శ్రీనివాసమంగాపురంలో అర్చకులుగా ఉన్న బాలాజీ రంగస్వామికి కూడా నోటీసులు ఇచ్చారు. కొంతమంది ఉద్యోగులు రాజకీయ సభలకు వెళ్లారని గుర్తించారు.. అందుకే వీరందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఉద్యోగులు రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ హెచ్చరిస్తోంది.
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు
గతేడాది అక్టోబరు 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో రద్దీ పెరిగింది. ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. విధుల్లో లేని ఉద్యోగులు పవన్‌ను చూడటానికి రావడంతో రద్దీ పెరిగిందని విజిలెన్స్ విభాగం తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిగింది. శ్రీనివాసమంగాపురంలో పనిచేసే అర్చకుడు బాలాజీ రంగకుమార్, తిరుపతి ఈఈ కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ చీర్ల కిరణ్ నిబంధనలు ఉల్లంఘించారని తేలింది. వారిద్దరూ డిప్యూటీ సీఎంను అనుసరించారని నివేదికలో తేల్చారు. సాధారణంగా ప్రముఖుల పర్యటనలో కొందరికి (ప్రొటోకాల్ సిబ్బంది, అర్చకులు, మేళం సిబ్బంది, అటెండర్లు, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అనుమతి ఉంటుంది) మాత్రమే విధులను కేటాయిస్తారు. కానీ కొందరు ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించారు. పవన్‌ను కలవాలనే ఉద్దేశ్యంతో ఆలయంలోకి ప్రవేశించారు. దీనివల్ల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద టీటీడీ ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. మరికొందరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.