విశాఖలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. భార్య రోజూ పేకాట ఆడుతుందని ఓ భర్త వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పేకాట స్థావరాలపై దాడి చేయగా ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖలోని లలిత నగర్లో ఉన్న ఒక నివాస భవనం పేకాటకు అడ్డాగా మారింది. నగరంలో నివాసం ఉంటున్న కొందరు మహిళలు రోజూ అక్కడికి వచ్చి పేకట ఆడూతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయిలా ఇలా ఒక మహిళ రోజు ఇంట్లో నుంచి వెళ్లి రావడం గమనించిన ఒక భర్త అనుమానం వచ్చి ఆమెను ఫాలో అవగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్య మరికొందరి మహిళలతో కలిసి పేకాట ఆడుతున్నట్టు గుర్తించిన భర్త స్థానిక పీఎస్లో వెళ్లి ఫిర్యాదు చేశాడు.
అయితే మొదట స్థానిక పోలీసులు ఆ భర్త ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో అతని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నగరంలో పేకాట స్థావరాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో లలిత నగర్లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టు తెలుసుకొని.. ఆ ఇంటిపై దాడి చేశారు. అయితే పోలీసులు అక్కడి వెళ్లినప్పుడు.. ఆరుగురు మహిళలు పేకాట ఆడుతూ కనిపించారు.
దీంతో పేకాటు ఆడుతున్న ఆరుగురి మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.22,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే పేకాట ఆడేది కేవలం మగవాళ్లే అనుకునే అపోహను ఈ పేకాట రాణులు తుడిచేశారు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆడవాళ్లు ఇలా పేకాట ఆడటమేంటని.. ఇది మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని దెబ్బతీసే పనిగా వాళ్లు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.