టాలీవుడ్ ఫోక్ సింగర్ మధుప్రియ చెల్లి శ్రుతి ప్రియ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం (ఆగస్టు 06) సుమంత్ పటేల్ అనే వ్యక్తితో కలిసి శ్రుతి ప్రియ ఏడడుగులు వేసింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. అలాగే పలువురు ఫోక్ సింగర్స్, సినీ సెలెబ్రెటీలు, సోహాల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు సందడి చేశారు. ముఖ్యంగా నర్సపల్లె సాంగ్ ఫేమ్ కనకవ్వ తన లైవ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక మధుప్రియ కూడా ఎనర్జిటిక్ గా డాన్సులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. బరాత్, హల్దీ, మెహందీ, సంగీత్ .. ఇలా అన్నీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ లు వేస్తూ ఆహూతులను అలరించింది. ప్రస్తుత మధు ప్రియ చెల్లి పెళ్లి వేడుక ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రుతి ప్రియకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
చెల్లి శృతిప్రియ ఎంగేజ్మెంట్ నుంచి వివాహం వరకు అన్ని పనులను తానే దగ్గరుండి చూసుకుంది మధుప్రియ. తెలంగాణ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ ‘ఆడపిల్లనమ్మా’ సాంగ్ తో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత 2011లో ‘దగ్గరగా దూరంగా’ సినిమాలో ‘పెద్దపులి’ అనే పాటతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనంతరం ఫిదా, టచ్ చేసి చూడు, నేల టికెట్, సాక్ష‍్యం, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సంక్రాంతికి వస్తున్నాం, లైలా తదితర చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ సంగీతాభిమానులను అలరించింది.
చెల్లి పెళ్లి బరాత్ లో మధు ప్రియ డ్యాన్స్..
ఇక సినిమాలు, పాటల సంగతి పక్కన పెడితే.. 18 ఏళ్ల వయసులోనే శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది మధుప్రియ. అయితే కొన్నాళ్లకు అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది.
మరిన్ని పెళ్లి వీడియోలు ఇవిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి