టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో అద్భుతంగా రాణించింది. ఇక ఇప్పుడు రాబోయే ఆసియా కప్‌లో శుభ్‌మన్ గిల్ ఆడే అవకాశం కనిపించట్లేదు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో శుభ్‌మన్ గిల్‌తో సహా 4గురు ఆటగాళ్ళు ఆడరు. ఆ ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..
శుభ్‌మన్ గిల్..
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 754 పరుగులు చేశాడు. కానీ అతడు ఆసియా కప్‌లో ఆడడు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. T20 ఫార్మాట్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అతనికి స్థానం దొరకడం కష్టం. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరూ ఓపెనర్లుగా వ్యవహరిస్తారని టాక్.
యశస్వి జైస్వాల్
యశస్వి జైస్వాల్ కూడా ఆసియా కప్‌లో ఆడడు. ఈ ఆటగాడు దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున ఆడతాడు. జైస్వాల్ T20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తరపున 14 మ్యాచ్‌ల్లో 559 పరుగులు సాధించాడు.
కెఎల్ రాహుల్
కెఎల్ రాహుల్ కూడా ఆసియా కప్‌లో ఆడడు. ఈ టోర్నమెంట్‌కు అతన్ని ఎంపిక చేయడం కష్టం. నిజానికి, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫైల్ అయింది. అలాగే టీ20 జట్టులో వికెట్ కీపర్ కూడా ఉన్నాడు.
రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటికే ఆసియా కప్ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లోని నాల్గవ టెస్ట్‌లో రిషబ్ గాయపడ్డాడు. ఈ ఆటగాడు 6 వారాల పాటు మైదానానికి దూరంగా ఉండాలి. వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో కూడా అతను ఆడటం కష్టమని తెలుస్తోంది. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా గాయపడ్డాడు. ఆసియా కప్‌లో కూడా ఆడటం కష్టమే.
ఇది చదవండి: ఎవర్రా సచిన్.! 140 సెంచరీలు, 36 వేలకుపైగా పరుగులు.. ఈ తోపు బ్యాటర్ బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..