అయితే ఆమె అకౌంట్‌లోకి ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడినుంచి వచ్చిందనేదీ మిస్టరీగా మారింది. ఈ ఘటనపై ఆదాయపు పన్ను శాఖదర్యాప్తు చేపట్టింది. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరణించిన ఒక సాధారణ మహిళ ఖాతాలోకి ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. గ్రేటర్ నోయిడాకు చెందిన గాయత్రి దేవి అనే మహిళ రెండు నెలల క్రితం మరణించింది. ఆమె కుమారుడు 19 ఏళ్ల దీపక్.. తన తల్లి ఖాతాను నిర్వహిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తన తల్లి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఫోన్‌కి ఒక సందేశం వచ్చింది. అందులో ఒక లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలకు పైగా (10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299) డబ్బులు జమ అయినట్లుగా చూపించింది. మొదట ఈ సంఖ్యలో ఉన్న సున్నాలను చూసి దీపక్ ఆశ్చర్యపోయాడు. ఇది పొరపాటు అనుకుని తన స్నేహితులకు ఈ సందేశాన్ని పంపించాడు. వారు నిజంగానే మీ అమ్మ ఖాతాలో లక్షల కోట్లు క్రెడిట్ అయ్యాయని చెప్పారు. అతడు కూడా ఖాతా చూసుకుని మరింత షాక్ అయ్యాడు. దీంతో సోమవారం రోజు ఉదయమే.. దీపక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ శాఖకు వెళ్లాడు.ఈ సంఘటన గురించి బ్యాంకు అధికారులకు తెలియజేయగా.. వారు కూడా నివ్వెరపోయారు. ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీ జరగడం అసాధారణం కావడంతో.. వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేసి, ఈ విషయాన్ని ఆదాయపు పన్ను విభాగానికి తెలియజేశారు. ఈ భారీ మొత్తం ఖాతాలో జమ కావడానికి పలు కారణాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది బ్యాంకింగ్ లోపం వల్ల జరిగిందా, సాంకేతిక సమస్య వల్ల జరిగిందా లేదా మనీలాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు సంబంధించినదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇంత పెద్ద మొత్తం ఒక సాధారణ వ్యక్తి ఖాతాలోకి, అందులోనూ మరణించిన వ్యక్తి ఖాతాలోకి రావడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఈ మొత్తంపై ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రారంభించింది. దీని వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
New Traffic Rules: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే.. అంతే
గుడ్‌న్యూస్.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు
Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?
సునామీని సైతం అడ్డుకునే అడవులివే! ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకుల క్యూ
ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం