Andhra Pradesh Old Tyres Scrap Business Income,పాత టైర్లు కదా అని లైట్ తీసుకోవద్దు.. రూ.లక్షల్లో సంపాదించొచ్చు, ఆ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయంటే – get income with old tyres scrap also in andhra pradesh here is details
Andhra Pradesh Old Tyres Business Income: పాత టైర్లను పనికిరానివిగా తీసిపారేయకండి. వాటితోనూ డబ్బు సంపాదించవచ్చు. టైర్లను చిన్న ముక్కలుగా కట్ చేసి, వేడి చేసి ఆయిల్, కార్బన్, ఇనుమును వేరు చేస్తారు. ఈ ఆయిల్‌ను తారు తయారీలో వాడుతున్నారు. టైర్ల నుంచి వచ్చిన ఇనుమును ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కార్బన్‌ను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తారు. ఇలా పాత టైర్లతో లక్షల్లో ఆదాయం పొందవచ్చు. విజయవాడ, విశాఖపట్నంలో టైర్ల పరిశ్రమలు ఉన్నాయి.
హైలైట్:
ఏపీలో పాత టైర్లతో ఆదాయం
ఆయిల్, కార్బన్, ఇనుము
తారు తయారీలో ఆయిల్
ఏపీలో పాత టైర్లతో సంపాదన (ఫోటోలు– Samayam Telugu)
పాత టైర్లు కదా అని లైట్ తీసుకోవద్దు బాస్.. వీటితో కూడా డబ్బులు సంపాదించొచ్చు. పాత టైర్ల ద్వారా ఆయిల్, కార్బన్, ఇనుము వంటివి తీయొచ్చు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో ఈ టైర్లకు సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలలో టైర్లను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇనుమును వేరు చేస్తారు. ఈ టైరు ముక్కల్ని ఒక యంత్రంలో వేసి 250-370 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు.. అందులో నుంచి కార్బన్‌ను వేరు చేస్తారు. ద్రవాన్ని కండెన్సర్‌లోకి పంపి చల్లబరుస్తారు.. ఆయిల్ వడకట్టి నిల్వ చేస్తారు.ఈ ఆయిల్‌ను నాణ్యతను బట్టి, మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి లీటర్ రూ.65 వరకు ఉంటుంది.. మూడు వేల లీటర్లకు ఏకంగా రూ.1.95 లక్షల వరకు ఆదాయం వస్తుందట. అదే ఐరన్ అయితే కేజీ రూ.16 చొప్పున కొనుగోలు చేస్తారట.. కార్బన్ కేజీ రూ.6చొప్పున ఆదాయం వస్తుంది అంటున్నారు. ఇలా ఏకంగా లక్షల్లో ఆదాయం సమకూరుతుంది అంటున్నారు. ఈ టైర్ల ప్రొసెస్ చేసే ఫ్యాక్టరీలు విజయవాడ సమీపంలోని ఆటోనగర్‌లో నాలుగు, ఇబ్రహీంపట్నంలో రెండు ఉన్నాయట. విశాఖపట్నంలో ఒకటి, రెండు ఉన్నాయంటున్నారు. ఇలా పాత టైర్లతో వచ్చే కాలుష్యాన్ని నివారించొచ్చు అంటున్నారు.
గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!
పాత టైర్ల నుంచి తీసిన ఆయిల్‌ను తారు తయారీలో ఉపయోగిస్తున్నారు. తారు తయారీలో డీజీల్‌కు బదులుగా ఈ ఆయిల్‌ను వాడుతున్నారు. డీజిల్ లీటర్ రూ.100కుపైనే ఉంది.. అదే ఈ ఆయిల్ అయితే రూ.65కే వస్తుంది. బెల్లం, అల్యూమినియం పాత్రలు తయారు చేసే బాయిలర్స్కు ఉపయోగిస్తారట. టైర్ల నుంచి వచ్చిన ఇనుమును ఛత్తీస్‌గఢ్, రాయపూర్‌లోని పరిశ్రమలకు ఎగుమతి చేస్తారట. ఇక టైర్ల నుంచి వచ్చిన కార్బన్‌ను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తారట. కార్బన్‌ను సున్నపురాయి, లేటరైట్‌ను వేడి చేసేందుకు బొగ్గుతో వేస్తారట. మొత్తం మీద పాత టైర్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు.. ఆయిల్, కార్బన్, ఇనుము వంటివ తీసి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో పాత టైర్లతో వ్యాపారం కూడా నడుస్తోందని చెప్పొచ్చు.. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి