Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: కొత్త కెప్టెన్‌ను తొలిసారి కలిసిన ‘హిట్‌మ్యాన్’.. ఏమన్నాడో తెలుసా?

15 October 2025

ట్రంప్ అమెరికా బెలూన్ పేలింది! టాప్ 10 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

15 October 2025

ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rs 5 Crore Job Offer Guntakal BTech Student,గుంతకల్లు యువకుడి టాలెంట్.. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం – ap guntakal btech student in america got job with rs 5 cr per annum
ఆంధ్రప్రదేశ్

Rs 5 Crore Job Offer Guntakal BTech Student,గుంతకల్లు యువకుడి టాలెంట్.. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం – ap guntakal btech student in america got job with rs 5 cr per annum

.By .7 September 2025No Comments8 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rs 5 Crore Job Offer Guntakal BTech Student,గుంతకల్లు యువకుడి టాలెంట్.. బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం – ap guntakal btech student in america got job with rs 5 cr per annum
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్ అనే యువకుడు అద్భుతమైన ప్రతిభతో ఇంకా చదువు పూర్తి కాకముందే మంచి జాబ్ సాధించాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోన్న సాయి సాకేత్.. అమెరికాలోని ఆప్టివర్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. దీని కన్నా ముందుగా సాయిసాకేత్‌కు పది వారాల ఇంటర్న్‌షిప్‌కు గాను రూ.కోటి వేతనం లభించింది. కోర్సు పూర్తవగానే అదే సంస్థ రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

హైలైట్:

  • గుంతకల్లు యువకుడి ప్రతిభ
  • బీటెక్ ఫైనల్ ఇయర్‌లోనే జాబ్
  • ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ
guntakal sai saketh
గుంతకల్లు యువకుడికి రూ.5కోట్ల ప్యాకేజీతో జాబ్(ఫోటోలు– Samayam Telugu)
టాలెంట్ ఉండాలే కానీ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. చదువు పూర్తి కాకముందే.. కళ్లు చెదిరే జీతం ఆఫర్ చేస్తుంటాయి కంపెనీలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కూడా ఈ కోవకు చెందినవాడే. అతడు బీటెక్ చదువుతున్నాడు. ఇంకా పూర్తి కాలేదు. కానీ ఈలోపే అద్భుతమైన ఆఫర్లు దక్కించుకున్నాడు. పది వారాల ఇంటర్నషిప్ ప్రోగ్రాం కోసం రూ.కోటి జీతం ఇచ్చే ఆఫర్‌తో పాటు అది పూర్తికాగానే అదే కంపెనీలో ఏడాదికి రూ.5కోట్ల ప్యాకేజీతో జాబ్ కొట్టాడు. ఆ వివరాలు.. గుంతకల్లుకు చెందిన సాయిసాకేత్‌ అనే యువకుడు తన టాలెంట్‌తో కళ్లు చెదిరే ప్యాకేజీ వచ్చే జాబ్ కొట్టాడు. సంవత్సరానికి రూ.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. అది కూడా అమెరికాలో. యూఎస్‌లోని ఆప్టివర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సాయి సాకేత్ ఉద్యోగం సాధించాడు. ముందుగా ఈ కంపెనీలో 10 వారాల పాటు ఇంటర్న్‌షిప్‌ కోసం అర్హత సాధించాడు సాయి సాకేత్. దీనికి రూ.కోటి వేతనం చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది.

అలానే కోర్సు పూర్తి కాగానే.. అదే కంపెనీలో ఏడాదికి రూ.5 కోట్లు ప్యాకేజీ ఇవ్వడానికి ఆమోదం తెలుపుతూ.. ప్రాథమికంగా ఒప్పందం కుదుర్చుకుందని సాయి సాకేత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక సాయి సాకేత్ విషయానికి వస్తే.. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ , అనంతపురం జిల్లాలోని గుంతకల్లు. కానీ సాకేత్ తల్లిదండ్రులైన రమేశ్, వాసవి దంపతులు పది సంవత్సరాల క్రిత అమెరికా వెళ్లారు. సాయి సాకేత్ ప్రస్తుతం అక్కడే బీటెక్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న సాకేత్.. చదువు పూర్తి కాకముందే.. ఇంత మంచి ప్యాకేజీతో కొలువకు అర్హత సాధించడం విశేషం.

ఈ జాబ్‌కి ఎంపిక చేయడం కోసం ఆప్టివర్ కంపెనీ నిర్వహించిన అన్ని పరీక్షల్లో సాయి సాకేత్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. టెస్ట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్, బిజినెస్, మ్యాథ్స్ వంటి విభాగాల్లో అత్యంత ప్రతిభ చూపినందుకుగాను సదరు కంపెనీ సాయి సాకేత్‌ను ఈ జాబ్‌కి ఎంపిక చేసింది. కుమారుడికి ఇంత మంచి ప్యాకేజీతో ఉద్యోగం రావడం.. అది కూడా చదువు పూర్తి కాకముందే రావడంపై సాయి సాకేత్ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువత అతడిని ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన స్థానికులు సాయి సాకేత్‌ని ప్రశంసిస్తున్నారు.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి