Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Chanakya Niti: వైవాహిక జీవితం అందంగా సాగాలంటే చాణక్య చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి..లేదంటే పట్టాలు తప్పుతుంది..
తాజా వార్తలు

Chanakya Niti: వైవాహిక జీవితం అందంగా సాగాలంటే చాణక్య చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి..లేదంటే పట్టాలు తప్పుతుంది..

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chanakya Niti: వైవాహిక జీవితం అందంగా సాగాలంటే చాణక్య చెప్పిన ఈ 4 విషయాలు పాటించండి..లేదంటే పట్టాలు తప్పుతుంది..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అంశాల గురించి ప్రస్తావించాడు.. ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలాంటి సందర్భాల్లో వెనకడుగు వేయాలి.. ఎప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించాడు.. అంతేకాకుండా.. విజయవంతమైన జీవితం కోసం ఎన్నో సూచనలు చేశాడు.. అందుకే.. చాణక్య నీతి విధానాలను నేటికీ అనుసరిస్తుంటారు. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో యవ్వనంలో చేయాల్సిన పనులను కూడా బోధించాడు.. కొన్ని తప్పటడుగులు వేయడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించాడు. అందుకే.. చిన్న వయస్సులో కొన్ని తప్పులు చేయకూడదని చెప్పాడు..

వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం.. చాలా సమన్వయం అవసరం. కనుక ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. లేదా వివాహం చేసుకోబోతున్నా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా నిర్లక్షం చేయడం చాలా సార్లు జరుగుతుంది. అందుకు తగిన పర్యవసానాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. అందుకు కారణం మీ స్వభావంలో మీకు తెలియని కొన్ని లోపాలు.. వీటి కారణంగా వైవాహిక జీవితం ప్రభావితం అవుతుంది. అటువంటి పరిస్థితిలో వివాహ బంధం జీవితాంతం పదిలంగా ఉండాలంటే పొరపాటున కూడా పునరావృతం చేయకూడని కొన్ని పనులున్నాయి. వీటిని శాశ్వతంగా వదిలివేయవలసి ఉంటుంది. చాణక్యుడు చెప్పిన ఆ గుణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. అవి మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాదు.. ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తాయి కూడా..

గోప్యత
భార్యాభర్తల మధ్య సంబంధంలో గోప్యత చాలా ముఖ్యం. భార్యాభర్తలు తమ మధ్య ఉన్న విషయాలను తమలో తామే ఉంచుకోవాలి. ఆ విషయాలను ఏ విధంగానూ మూడవ వ్యక్తికి చేరనివ్వకూడదు. భార్యాభర్తల మధ్య రహస్యాలు మూడో వ్యక్తికీ చేరితే అది సంబంధంలో నమ్మకాన్ని నాశనం చేస్తుంది. అంతే కాకుండా అపార్దాలు కూడా తలెత్తుతాయి.

అబద్ధం
ఈ ఒక్క అలవాటు భార్యాభర్తల బంధాన్నే కాదు ఎలాంటి సంబంధాన్ని అయినా నాశనం చేస్తుంది. ఏదైనా సంబంధమైనా సరే అబద్ధాలపై ఎంతో కాలం నిలబడి ఉండదు. సంబంధంలో అబద్ధాలు ఉంటే ఆ సంబంధానికి ఎటువంటి ఆధారం ఉండదు. అబద్ధాల మీద ఏర్పాటు చేసుకున్న సంబంధం ఎప్పుడైనా విచ్ఛిన్నం కావచ్చు. అందువల్ల ఎటువంటి సందర్భం ఎదురైనా అబద్ధాలను ఆశ్రయించడం మంచిది కాదని అది విషాదకరంగా మిగులుస్తుందని ఆచార్య చాణక్యుడు నొక్కిచెప్పారు.

ఇవి కూడా చదవండి

ఖర్చు
భార్యాభర్తల మధ్య సంబంధంలో డబ్బు విషయాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి. నేటి కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా సంపాదిస్తున్నారు. పూర్వ కాలంలో ఇద్దరి పాత్రలు కాస్త భిన్నంగా ఉండేవి. అయితే ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు జంటలు సంపాదిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో డబ్బు విషయాలకు సంబంధించి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. పొదుపు, ఖర్చు , పెట్టుబడి గురించి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకరి ఆర్థిక పరిస్థితి గురించి మరొకరు తెలుసుకోవాలి. అంతేకాదు అనవసరమైన ఖర్చులను నివారించండి. ఎందుకంటే సంపదన, లేమి వల్ల చాలా సంబంధాలలో పగుళ్లు ఏర్పడతాయి.

వ్యసనాలు
వ్యసనం మానవులకు శారీరకంగా మాత్రమే హానికరం కాదు.. వారిని మానసికంగా, సామాజికంగా చాలా బలహీనంగా చేస్తుంది. మాదకద్రవ్యాలకు బానిసైన వారి జీవితాలు ఎప్పటికీ తిరిగి పట్టాలెక్కవు. అలాంటి పరిస్థితుల్లో భర్త అయినా, భార్య అయినా సరే.. ఏదైనా మత్తుకి అలవాటు అయితే ఆ అలవాట్ల నుంచి బయటపడాలి. అసలు వ్యసనాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవడానికి మద్యం వ్యసనమే అతి పెద్ద కారణమని పలు సర్వేల్లో వెల్లడైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ.. ” గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ” ఎక్కడో తెలుసా? | Kumbhalgarh Fort wall which is known as great wall of india history and full details about fort also

1 May 2026

IPL 2026 : జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

1 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు…

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ.. ” గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ” ఎక్కడో తెలుసా? | Kumbhalgarh Fort wall which is known as great wall of india history and full details about fort also

1 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.