Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»West Godavari Zp Chairman Joined Tdp,జనసేన పార్టీకి మరో ట్విస్ట్.. ఆమె కూడా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారుగా! – west godavari zp chairperson padma sri joined tdp
ఆంధ్రప్రదేశ్

West Godavari Zp Chairman Joined Tdp,జనసేన పార్టీకి మరో ట్విస్ట్.. ఆమె కూడా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారుగా! – west godavari zp chairperson padma sri joined tdp

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
West Godavari Zp Chairman Joined Tdp,జనసేన పార్టీకి మరో ట్విస్ట్.. ఆమె కూడా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిపోయారుగా! – west godavari zp chairperson padma sri joined tdp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు. మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఆమె పసుపు కండువా కప్పుకున్నారు. పద్మశ్రీతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్దిని చూసే నేతలు తమ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. ఘంటా పద్మశ్రీ భర్త, వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ ప్రసాదరావు ఇప్పటికే టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.పద్మశ్రీ దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌లో మొత్తం సభ్యుల సంఖ్య 48 కాగా వీరవాసరం, ఆచంట స్థానాల్లో జనసేన, టీడీపీ గెలిచింది. ఇక మిగిలిన 46 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. జెడ్పీ ఛైర్ పర్సన్ టీడీపీలో చేరడంతో పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ఇప్పటికే ఏలూరు కార్పొరేషన్ టీడీపీ ఖాతాలోకి చేరగా.. జెడ్పీ పీఠంపైనా పసుపు జెండా ఎగిరే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలువురు జెడ్పీటీసీలు టీడీపీలో చేరగా.. మరికొందరు కూడా త్వరలో అదే బాటలో నడవబోతున్నట్లు తెలుస్తోంది.

ఘంటా పద్మశ్రీ, ప్రసాదరావు దంపతులు ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరు జనసేన పార్టీలో చేరతామని ప్రకటించారు.. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుని తెలుగు దేశం పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ముందు ఘంటా ప్రసాదరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఇవాళ పద్మశ్రీ కూడా అదేబాటలో నడిచారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాజీ మంత్రి ఆళ్లనాని పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఆ తర్వాత ఏలూరు మేయర్ నూర్జహాన్, మరికొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అలాగే మరికొందరు కీలక నేతలు కూడా అదేదారిలో నడిచారు. తాజాగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ దంపతులు టీడీపీలోకి వచ్చారు.

వైఎస్సార్‌సీపీకి ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావులు రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు కూడా పదవితో పాటూ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలసిందే.. వీరంతా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Hanuman Jayanti Tirumala,తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం.. – ttd special arrangements for hanuman jayanti on may 12 in tirumala

1 May 2026

Sudheer Reddy Reward For 10th Students,పదో తరగతి టాపర్లకు స్థలం.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంపరాఫర్ – srikalahasti mla sudheer reddy announced cash and plots as reward for the tenth class exams topper students

1 May 2026

Andhra Pradesh: 5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను జయించిన ఏపీ దివ్యాంగ విద్యార్థులు..

1 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

ఇరాన్-అమెరికా యుద్ధానికి సంబంధించి తాజాగా వైట్ హౌస్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు…

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ.. ” గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ” ఎక్కడో తెలుసా? | Kumbhalgarh Fort wall which is known as great wall of india history and full details about fort also

1 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

1 May 2026

Telangana: గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. తీరనున్న కరెంటు కష్టాలు!

1 May 2026

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

1 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025496

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.