ప్రసార్ భారతి.. దేశంలోని వివిధ భ్రాంచుల్లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద హైదరాబాద్ సహా రాంచీ, చెన్నై, బెంగళూరు, ముంబై, సిమ్లా నగరాల్లో మొత్తం 59 సీనియర్ కరస్పాండెంట్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2, బులిటెన్ ఎడిటర్, బ్రాడ్ కాస్ట్ ఎగ్జిక్యూటివ్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 21, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు ఇవే..
- సీనియర్ కరస్పాండెంట్ పోస్టుల సంఖ్య: 2
- యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2 పోస్టుల సంఖ్య: 7
- యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-3 పోస్టుల సంఖ్య: 10
- బులిటెన్ ఎడిటర్ పోస్టుల సంఖ్య: 4
- బ్రాడ్ కాస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య: 4
- వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 2
- అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్ పోస్టుల సంఖ్య: 3
- కంటెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య: 8
- కాపీ ఎడిటర్ పోస్టుల సంఖ్య: 7
- కాపీ రైటర్ పోస్టుల సంఖ్య: 1
- ప్యాకింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 6
- వీడియోగ్రాఫర్ పోస్టుల సంఖ్య: 5
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ లేదా జర్నలిజం డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సంబంధిత పోస్టును బట్టి అభ్యర్ధుల వయోపరిమితి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.