Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Bank Holidays: అక్టోబర్‌ నెల పండగ సీజన్‌.. 11 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజు అంటే..

14 October 2025

Human Brain: చనిపోయే చివరి క్షణం.. మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?..అసలు విషయం ఇదేనట..!

14 October 2025

Diwali Festival: దేశవ్యాప్తంగా దీపావళి తేదీపై గందరగోళం.. పండగ ఏ రోజు జరుపుకోవాలి? CAIT కీలక సూచన

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Vande Bharat Express Trains Depot,ఏపీలో కొత్తగా వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.300 కోట్లతో, ఆ ప్రాంతానికి మహర్దశ! – vande bharat express trains maintenance depot likely proposed in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Vande Bharat Express Trains Depot,ఏపీలో కొత్తగా వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.300 కోట్లతో, ఆ ప్రాంతానికి మహర్దశ! – vande bharat express trains maintenance depot likely proposed in visakhapatnam

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Vande Bharat Express Trains Depot,ఏపీలో కొత్తగా వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.300 కోట్లతో, ఆ ప్రాంతానికి మహర్దశ! – vande bharat express trains maintenance depot likely proposed in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Vande Bharat Express Trains Maintenance Depot: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిని పెంచేందుకు, కొత్త మార్గాల్లో నడిపేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం రూ.300 కోట్లతో ప్రత్యేక డిపో ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైళ్ల నిర్వహణ సులభతరం అవుతుందని.. అలాగే సమయపాలన మెరుగుపడి, ఖర్చులు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుందంటున్నారు.

హైలైట్:

  • ఏపీలో వందేభారత్ నిర్వహణకు డిపో
  • విశాఖపట్నంలో ఏర్పాటుకు ప్రతిపాదన
  • రూ.300 కోట్లతో ఏర్పాటు దిశగా అడుగులు
VisakhapatnamVande Bharat Maintenance
విశాఖపట్నంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ల డిపో(ఫోటోలు– Samayam Telugu)
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వీటి సంఖ్యను పెంచడానికి, కొత్త మార్గాల్లో నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. చెన్నైలో ఈ రైళ్ల తయారీ వేగవంతం అవుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక డిపో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మర్రిపాలెంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య రెండు రైళ్లు (ఒకటి అటు, ఒకటి ఇటు) ఏకకాలంలో తిరుగుతున్నాయి. మూడో రైలు విశాఖపట్నం నుంచి దుర్గ్‌కు, నాలుగో రైలు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్నాయి.ఈ నాలుగు రైళ్లలో, సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలు మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకునే రైలు నిర్వహణ పనులు ప్రస్తుతం విశాఖపట్నంలోని కోచ్ మెయింటెనెన్స్ డిపోలోనే జరుగుతున్నాయి. మిగిలిన మూడు రైళ్ల నిర్వహణ ఆయా ప్రాంతాల్లోనే చేస్తున్నారు. ఈ రైళ్లకు అవసరమైన విడి భాగాలను (spare parts) చెన్నై నుంచి తెప్పించి అమర్చుతున్నారు. అయితే కొత్త డిపో ఏర్పాటుతో విశాఖపట్నం నుంచి నడిచే అన్ని వందే భారత్ రైళ్ల నిర్వహణ ఇక్కడే సులభతరం అవుతుందంటున్నారు. ఇది రైళ్ల సమయపాలనను మెరుగుపరచడంతో పాటు, నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారట. రైల్వే మంత్రిత్వ శాఖ వందే భారత్ రైళ్ల సేవలను విస్తరించే పనిలో ఉండటంతో.. విశాఖపట్నంలో డిపో ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారట.

విశాఖపట్నం జోనల్ కేంద్రంగా మారడంతో, భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లు ఇక్కడి నుంచి నడిచే అవకాశం ఉంది. తిరుపతికి కూడా ఒక రైలు త్వరలో వస్తుందని అంచనా వేస్తున్నారట. సాధారణ రైళ్లకు ఎనిమిది గంటలు పట్టే నిర్వహణ పనులకు, వందే భారత్ రైలుకు పది గంటలు పడుతుంది. దీనికోసం ప్రత్యేకమైన ‘పిట్‌ లైన్‌’ అవసరం. ఈ పిట్‌ లైన్‌పై రైలును నిలిపితే, సిబ్బంది కిందకు దిగి మరమ్మతులు చేస్తారు. అలాగే విశాఖపట్నం ఇప్పుడు వందే భారత్ రైళ్లకు జోనల్ కేంద్రంగా మారింది. దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడి నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడిచే అవకాశాలున్నాయి.

వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్.. 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

అందుకే రైల్వే అధికారులు ముందుగానే నిర్వహణ డిపో ప్లాన్ చేస్తున్నారట. మర్రిపాలెంలో ఈ నిర్వహణ డిపో ఏర్పాటుకు అవసరమైన భూమి అందుబాటులో ఉందని తెలుస్తోంది. దీనికోసం సుమారు రూ.300 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ డిపో ఏర్పాటుతో వందే భారత్ రైళ్ల నిర్వహణ సులభతరం అవుతుందంటున్నారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుంది అంటున్నారు. ఇప్పటికే విజయవాడ, రేణిగుంట దగ్గర కూడా వందేభారత్ డిపోలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి