Anakapalle Land Registrations Income: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, కంపెనీలు క్యూ కట్టాయి. ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు కూడా పెట్టుబడులు వచ్చేశాయి. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్, డ్రగ్ పార్కుల రాకతో భూముల ధరలు పెరిగి, రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యాలను అధిగమించింది. ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తయ్యేలోపే జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం సమకూరింది.
హైలైట్:
- అనకాపల్లి జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి
- ఈ ఆర్థిక సంవత్సరం సగం పూర్తయ్యేలోపే టార్గెట్
- నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది

అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, సబ్బవరం కార్యాలయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పురోగతి సాధించాయి. నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయాన్ని ఆర్జించాయి. ఆర్థిక సంవత్సరం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ, విక్రయదారులతో సందడిగా మారాయి. ఈ ఏడాది రూ. 319 కోట్ల లక్ష్యానికి గాను, తొలి ఆరు నెలల్లోనే రూ. 161.88 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోల్చితే వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ల విషయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాటూ ధరల్లో మార్పులతో ఆదాయం పెరిగిందని చెబుతున్నారు అధికారులు. అంతేకాదు ఎలమంచిలి, నక్కపల్లి కార్యాలయాల్లో పారిశ్రామీకరణ ప్రభావంతో ఆదాయం భారీగా పెరిగిదంటున్నారు. రిజిస్ట్రేషన్లలో వేగం, వెంటనే డాక్యుమెంట్లు అందజేస్తుండటంతో సేవలు బాగా మెరుగుపడ్డాయంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అనుకున్నా లక్ష్యాన్నీ చేరుకుంటామని నమ్మకంతో ఉన్నారు.
చంద్రబాబు సీఈవో ఆఫ్ ఆంధ్ర.. మంచి అడ్మినిస్ట్రేటర్
ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 46 శాతం పెరిగింది. ఈ వృద్ధి రేటు 39 శాతంగా నమోదైంది. రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. అనకాపల్లి జిల్లాల్లో కూడా ఆదాయం పెరగడం విశేషం.