క్రమంగా ప్రపంచమంతటా విస్తరించింది. తాజాగా చీమల సహాయంతో యోగర్ట్‌ను తయారు చేసి చరిత్ర సృష్టించారు శాస్త్రవేత్తలు. దీనిని డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఉన్న అల్‌కెమిస్టు రెస్టారెంటులో కస్టమర్లకు అందించారు. ఐ సైన్స్ జర్నల్ కథనం ప్రకారం.. రెస్టారెంటులోని ఫ్రిడ్జ్‌లో చీమలు పడిన పాలు యోగర్ట్‌గా రూపాంతరం చెందడాన్ని షెఫ్ గుర్తించారు. ఇది ఆంత్రోపాలజిస్టులు, పాకశాస్త్ర నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి ఉపయోగపడింది. సాధారణంగా దేవదారు కాయలు, దూలగొండి మొక్కల నుంచి తీసిన సహజసిద్ధమైన మైక్రోబ్స్‌ను యోగర్ట్ తయారు చేయడానికి వాడేవారు. ఆ తర్వాత 1900 సంవత్సరాల్లో పారిశ్రామికంగా యోగర్ట్‌ను.. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలోని రెండు స్పీసిస్‌ను ఉపయోగించి తయారు చేయడం ప్రారంభించారు. తాజాగా శాస్త్రవేత్తలు సహజసిద్ధంగా యోగర్ట్ తయారీపై దృష్టి సారించారు. అందులో భాగంగా బల్గేరియాలోని రెడ్ వుడ్ చీమలుండే ప్రాంతంలో ప్రయోగాలు చేపట్టారు. చీమలు, వాటి మైక్రోబ్‌లు.. ఎంజైమ్‌లను, యాసిడ్లను అందించి యోగర్ట్ తయారీకి సహాయం చేసాయి. ఇందుకోసం వారు ఆవు పాలను వేడి చేశారు. ఆ పాలను జార్‌లో పోశారు. అందులో నాలుగు బతికున్న చీమలను వేశారు. ఆ జార్‌ను చీజ్‌క్లాత్‌తో మూసివేసి గొయ్యి తీసి కప్పి పెట్టారు. దీంతో యోగర్ట్ తయారైంది. పెరుగు, యోగర్ట్ రెండింటిలోనూ పోషకాలు ఉంటాయి. పెరుగు మన శరీరానికి చలవ చేసి.. వేడిని తగ్గిస్తుంది. మసాలాల వల్ల బాడీలో పెరిగే వేడిని పెరుగు సరిచేస్తుంది. యోగర్ట్‌లో ప్రోటీన్ ఎక్కువ. పెరుగుతో పోల్చితే దాదాపు డబుల్ ఉంటుంది. పెరుగు తయారీ మనకు తెలిసిందే. కాచిన పాలు చల్లారాక… కాస్త పెరుగు వేస్తే… కొన్ని గంటల్లో పాలు మొత్తం పెరుగు అయిపోతాయి. ఇందుకు కారణం.. పెరుగులో ఉండే బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చేస్తుంది. కొంతమంది నిమ్మరసం, వెనిగర్ వంటివి కూడా వేసి.. పెరుగుగా మార్చుతారు. యోగర్ట్ అనేది మరో రకం. దీన్ని మన ఇళ్లలో తయారుచెయ్యలేం. దీని తయారీలో కృత్రిమ యాసిడ్స్ కలుపుతారు. అంటే ఇది కృత్రిమ ప్రక్రియ ద్వారా తయారయ్యేదని అనుకోవచ్చు. పెరుగు, యోగర్ట్ రెండింటిలోనూ బ్యాక్టీరియా ఉంటుంది. పెరుగుతో పోల్చితే.. యోగర్ట్‌లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. పెరుగులో రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి. ప్రత్యేకించి ఇదీ అని ఏదీ ఉండదు. అన్నీ కలిసి ఉంటాయి. యోగర్ట్ తయారీలో అలా కాదు.. ప్రత్యేకమైన బ్యాక్టీరియాను వాడుతారు. ఈ ప్రపంచంలో కొంతమందికి పెరుగు నచ్చదు. అంటే.. వారికి పెరుగులోని లాక్టోజ్ పడదు. అలర్జీ వస్తుంది. అలాంటి వారు యోగర్ట్ తినవచ్చు. అందులోనూ గ్రీక్ స్టైల్ యోగర్ట్ వారికి సరిగ్గా సెట్ అవుతుంది. గ్రీక్ యోగర్ట్ మందంగా ఉంటుంది. దేశవాళీ పెరుగు ఎప్పుడూ ఒకే ఫ్లేవర్‌తో ఉంటుంది. పుల్లగా, కమ్మగా ఉంటుంది. యోగర్ట్ అలా కాదు.. అందులో రకరకాల పండ్ల ఫ్లేవర్స్ కలుపుతారు. అంటే స్ట్రాబెర్రీ, మ్యాంగో, చాక్లెట్ ఫ్లేవర్ ఇలా. అందుకే యోగర్ట్ పిల్లలకు బాగా నచ్చుతుంది. యోగర్ట్‌ని రెడీ టూ ఈట్ ప్యాక్స్‌లో అమ్ముతుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ 4 తప్పులే ఆయుష్షును తగ్గించేస్తున్నాయా ?? మరి, జపనీయుల ఆరోగ్య రహస్యం ఏమిటి?
కోరింత దగ్గు చిన్నారులకు ప్రాణాంతకం.. గర్భిణిగా ఉన్నప్పుడే టీకా వేస్తే