ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సైతం ఇండస్ట్రీలో బాలనటిగా తెరంగేట్రం చేసింది. పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి.. ఇప్పుడు హీరోయిన్ గా సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న ఆమె.. తాను 4వ తరగతి చదువుతున్నప్పుడు తీసిన ఫోటోను షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు.. దృశ్యం సినిమాలో వెంకీ, మీనాల చిన్న కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
కేరళలోని వయనాడ్ కు చెందిన ఎస్తేర్ అనిల్.. పాపనాశం చిత్రంలో కమల్ హాసన్ కుమార్తెగా నటించింది. ఆమె 2010లో మలయాళ చిత్రం నల్లవన్ లో బాలనటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. 2013లో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాలో మోహన్ లాల్ కూతురిగా కనిపించింది. ఇందులో ఆమె నటకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
దృశ్యం సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేయగా.. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోనూ వెంకీ చిన్న కూతురిగా నటించింది ఎస్తేర్ అనిల్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తేర్ అనిల్.. కథానాయికగా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం లండన్‌లో బి.జి. డిగ్రీ పూర్తి చేసిన ఎస్తేర్, సంబంధిత ఫోటోను పోస్ట్ చేయడంతో పాటు, తాను 4వ తరగతిలో ఉన్నప్పుడు తీసుకున్న చిన్ననాటి ఫోటోను కూడా పోస్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..
ఇవి కూడా చదవండి : Cinema: రిషబ్ శెట్టి కాంతారా వెనక్కు నెట్టిన సినిమా.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..