మల్లోజుల వేణుగోపాల రావు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. తెలుగు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, బీకాం డిగ్రీ పూర్తి చేశారు. ఆయన వయసు ఇప్పుడు సుమారు 70 ఏళ్లు. ఆయన అన్నయ్య మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్‌జీ) కూడా ప్రముఖ మావోయిస్టు నాయకుడు. 2011లో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇది వేణుగోపాల్‌పై ప్రభావం చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు.
16 ఏళ్లలో ఉద్యమంలోకి…
1970ల చివర్లో, కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో 16 ఏళ్ల వయసులోనే వేణుగోపాల్ మావోయిస్టు భావజాలంతో సంబంధం ఉన్న రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ముప్పాల లక్ష్మణ రావుతో సమకాలికుడిగా ఉద్యమంలో పని చేశారు. అంటే సుమారు 50 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్నారు.
ఉద్యమంలో పాత్ర – ఎదుగుదల
వేణు గోపాల్ ప్రధానంగా పొలిటికల్, ఐడియాలజికల్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. మిలిటరీ ఆపరేషన్స్ కంటే భావజాలం, ప్రకటనలు, లెటర్స్ ద్వారా ఉద్యమాన్ని గైడ్ చేశారు. ఆయన పెన్-నేమ్ ‘అభయ్’, మరి అలియాస్‌లు సోను, భూపతి, వివేక్, రాజన్.
సీపీఐ (మావోయిస్టు)లో ఆయన రైజ్ ఇంప్రెసివ్. సెంట్రల్ కమిటీ మెంబర్‌గా మొదలై, పాలిట్‌బ్యూరో మెంబర్‌గా ఎదిగారు. ఉద్యమం యొక్క చీఫ్ స్పోక్స్‌పర్సన్, ఐడియాలజికల్ హెడ్‌గా పనిచేశారు. వేణుగోపాల్ తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్ నంబాల కేశవ రావు (బసవరాజు) మరణం తర్వాత, సీపీఐ (మావోయిస్టు)ను లీడ్ చేసే ఫ్రంట్ రన్నర్‌గా నిలిచారు. కాగా, బసవరాజు 2025 మేలో చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వేణుగోపాల్‌పై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఆయనపై రూ. 1 కోటి రివార్డు ఉంది. ఆయన ఉద్యమంలో ఎన్నో లెటర్స్, స్టేట్‌మెంట్స్ ద్వారా పార్టీ పాలసీలను ప్రకటించేవారు.
మావోయిస్టు లలో మార్పులు – విభేదాలు
కానీ, ఇటీవల వరుస దెబ్బలతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడటం, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్స్ తీవ్రతరం కావటం వల్ల ఆయనలో మార్పు వచ్చింది. 2024-25లో 471 మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లలో మరణించారు. 1,850 మంది లొంగిపోయారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా మార్చి 2026 నాటికి నక్సలిజాన్ని రూపుమాపాలు లేకుండా చేస్తామని ప్రకటించారు.
కలకలం రేపిన లెటర్
2025 ఆగస్ట్ 15న, ఆయన ‘టెంపరరీగా ఆర్మడ్ స్ట్రగుల్‌ను అబాండన్ చేయడం’ అనే టైటిల్‌తో ఒక లెటర్ రాశారు ఈ లెటర్ సెప్టెంబర్ 17న రిలీజ్ చేశారు. ఇందులో ఆర్మడ్ స్ట్రగుల్‌ను తాత్కాలికంగా ఆపేసి, మెయిన్‌స్ట్రీమ్‌లోకి రావాలని, భవిష్యత్తులో ఇతర పొలిటికల్ పార్టీలతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది పార్టీలో రిఫ్ట్ క్రియేట్ చేసింది. నార్త్ బస్తర్, గడ్చిరోలి, అబుజ్‌మడ్ డివిజన్లు ఆయనకు సపోర్ట్ చేశాయి. కానీ, జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి (దేవుజీ) రెబ్యూటల్ ఇచ్చి, ఇది ఆయన పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అని, సరెండర్ చేయడం ద్రోహం అని అన్నారు.
సెప్టెంబర్‌లో మరో లెటర్‌లో ఆయన ఆయుధాలు డౌన్ చేయడం గురించి మాట్లాడారు. పార్టీ సెంట్రల్ కమిటీ ఆయనకు ఆయుధాలు సరెండర్ చేయమని హెచ్చరించింది. లేదంటే ఫోర్స్‌ఫుల్‌గా ఆయుధాలు తీసుకుంటామని హెచ్చరిక చేసింది. వేణుగోపాల్ హెల్త్ డెటీరియరేట్ అవుతోంది, స్ట్రగుల్‌కు ఆయాసమవుతోంది అని రాశారు. చివరికి, అక్టోబర్ 6 లేదా అంతకు ముందు మావోయిస్ట్ పార్టీని వదిలేశారు.
క్లైమాక్స్.. లొంగిపోవడం..!
అక్టోబర్ 14, 2025న మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టు క్యాడర్లతో కలిసి లొంగిపోయారు. ఇది మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బ. ఆయన లెటర్‌లలో చెప్పినట్టు, ప్రస్తుత పాత్ ‘కంప్లీట్‌లీ రాంగ్’, లీడర్‌షిప్ మిస్టేక్స్ వల్ల సెట్‌బ్యాక్స్, క్యాడర్లు అనవసర సాక్రిఫైసెస్ చేయకూడదు అని రాశారు. వేణుగోపాల్ లొంగుబాటుతో మావోయిస్ట్ అగ్ర నేతలు ఎలా స్పందిస్తారో ఎదురు చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..