ఇన్నాళ్లు టాలీవుడ్‌లో సినిమా ఫెయిల్యూర్స్‌కు స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లనే ఎక్కువగా నిందించేవారు. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితికి నిర్మాణ సంస్థలు కూడా కారణమే అన్న వాదన తెరపైకి వచ్చింది. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన పెద్ద బ్యానర్లు కూడా ఈ మధ్యకాలంలో విజయాల కోసం తడబడుతున్నాయి. వరుస విజయాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన నిర్మాణ సంస్థలు కూడా ఇప్పుడు సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించడంలో విఫలమవుతున్నాయి. అందుకే టాలీవుడ్ సక్సెస్ రేట్ పడిపోవడంలో నిర్మాణ సంస్థల వాటా కూడా ఉందని విశ్లేషకులు అంటున్నారు. టాప్ బ్యానర్లు కేవలం కాంబినేషన్స్ సెట్ చేయడంపైనే దృష్టి పెడుతున్నాయని, కథా కథనాల విషయంలో మాత్రం తగినంత శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. నిర్మాతలు కాంబినేషన్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టడానికి మరో కారణం ఓటీటీ సంస్థలు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరోలకు తప్పని లీకుల కష్టాలు.. ఈ సమస్యకు చర్యలు తప్పనిసరి అంటున్న మేకర్స్
మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన రుక్మిణీ వసంత్
ప్లాన్ ఇంటర్నేషనల్ అంటున్న రాజమౌళి.. ఇక బాక్సులు బద్దలవ్వాల్సిందే
2026కి గట్టిగ ప్లాన్ చేసిన ప్రభాస్.. టార్గెట్ 1000 కోట్లు
Samantha: పూజలో సమంత పక్కన కూర్చున్నదెవరు ??