
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరక్కిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చింది. గ్యాంగ్ స్టర్ నేపధ్య కథతో తెరక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే దాదాపు 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకతిమ్చిది. ఈ సినిమాలో పవన్ ను ఎలా అభిమానులు చూడాలని కోరుకుంటారో అదే విధంగా వింటేజ్ పవన్ కళ్యాణ్ చూపించాడు సుజిత్. అంటే పవన్ కళ్యాణ్ ఫాన్స్ కోసం పవన్ కళ్యాణ్ అభిమాని తెరకెక్కించిన సినిమా ఒజీ అన్నమాట.
ఈ గ్యాంగ్ స్టార్ యాక్షన్ మూవీ కి సంబందించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా త్వరలో బుల్లి తెరపై అంటే ఓటీటీలో సందడి చేయనుంది. దీపావళి తర్వాత వెండి తెరపై వెలుగులు విరజిమ్మ నుందని అంటే అక్టోబర్ 23వ తేదీ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓజీ దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ.94 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎక్కడా ప్రకటన వెలువడలేదు.
View this post on Instagram
పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా అరుళ్ మోహన్ నటించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలిచిన ఈ సినిమాను DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై DVV దానయ్య నిర్మించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..