Virat Kohli: భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
లండన్ నుంచి ఢిల్లీకి ‘కింగ్’ రాక..
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ జూన్‌లో తన భార్య అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌కు వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత, అక్టోబర్ 14, మంగళవారం ఉదయం న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న కోహ్లీని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బ్లాక్ షర్ట్, వైట్ ట్రౌజర్ ధరించి, స్టైలిష్ లుక్‌లో కనిపించిన కోహ్లీని చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
తెల్లగడ్డం పోయింది.. కొత్త లుక్ వచ్చేసింది..!
Virat Kohli clicked at Delhi Airport Today. #ViratKohli pic.twitter.com/t9nvNpsCcC
— Saurabh! (@Viratfiedguyy) October 14, 2025
గతంలో, కోహ్లీ లండన్‌లో ఉన్నప్పుడు ప్రముఖ న్యాయవాది శశి కిరణ్ శెట్టితో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటోలో కోహ్లీ గడ్డం కొద్దిగా తెల్లబడి (Greying Beard) కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.
అయితే, తాజాగా ఢిల్లీలో కనిపించిన కోహ్లీ ఆ లుక్‌కు భిన్నంగా కనిపించారు. ఆయన జుట్టుతో పాటు గడ్డం కూడా నలుపు రంగులో డై (Dyed Black) చేసుకుని మరింత యంగ్‌గా, డ్యాషింగ్‌గా దర్శనమిచ్చారు. ఈ కొత్త లుక్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పాత తెల్లగడ్డం ఫోటోపై చర్చకు తెరపడినట్టైంది.
ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధం..
టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ (అక్టోబర్ 19 నుంచి ప్రారంభం) కోసం కోహ్లీ భారత జట్టుతో కలవనున్నారు.
సిరీస్ ప్రారంభం: అక్టోబర్ 19, పెర్త్ వేదికగా తొలి వన్డే.
జట్టు ప్రయాణం: భారత జట్టు అక్టోబర్ 15 (బుధవారం) రెండు బృందాలుగా ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది. కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఈ బృందంలో పయనించనున్నారు.
కెప్టెన్సీ: ఈ వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అనుభవం ఆస్ట్రేలియా పర్యటనలో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..