Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చుక్కలు చూపించనున్న చలి20 డిగ్రీలకు పడిపోనున్న టెంపరేచర్

15 October 2025

మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే

15 October 2025

కన్న కొడుకుపై స్టేషన్ మెట్లెక్కిన వృద్ధ దంపతులు.. విషయం తెలిసి పోలీసులే షాక్!

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kurnool Nandyal Districts School Holidays,ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. ఆ జిల్లాల్లో నేడు, రేపు సెలవులు.. మొత్తం 4 రోజులు.. లిస్ట్ ఇదే – two days holidays for school students in kurnool and nandyal districts due to pm narendra modi tour
ఆంధ్రప్రదేశ్

Kurnool Nandyal Districts School Holidays,ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. ఆ జిల్లాల్లో నేడు, రేపు సెలవులు.. మొత్తం 4 రోజులు.. లిస్ట్ ఇదే – two days holidays for school students in kurnool and nandyal districts due to pm narendra modi tour

.By .15 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kurnool Nandyal Districts School Holidays,ఏపీలో స్కూల్ విద్యార్థులకు పండగే.. ఆ జిల్లాల్లో నేడు, రేపు సెలవులు.. మొత్తం 4 రోజులు.. లిస్ట్ ఇదే – two days holidays for school students in kurnool and nandyal districts due to pm narendra modi tour
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh School Holidays: దీపావళి జోష్‌లో ఏపీ విద్యార్థులు ఉన్నారు. అయితే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనతో వరుసగా రెండు రోజులు సెలవులు. దసరా తర్వాత మళ్ళీ సెలవుల పండగే. అయితే, ప్రధాని సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు కూడా భారీగా ఉండనున్నాయి. పలు నగరాల మధ్య ప్రయాణించే వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. ఈ మార్పులు ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు అమలులో ఉంటాయి.

హైలైట్:

  • ఏపీలోని ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
  • ప్రధాని మోదీ టూర్ కారణంగా ప్రకటన
  • నంద్యాల, కర్నూలు జిల్లాల్లో స్కూళ్లకు
Kurnool Nandyal School Holidays
ఏపీలోని ఆ రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలో విద్యార్థులు దీపావళి జోష్‌లో ఉన్నారు.. వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 19న ఆదివారం కాగా.. ఈ నెల 20న దీపావళి సెలవు వచ్చింది. రాష్ట్రంలోని ఓ రెండు జిల్లాల్లో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండటంతో.. ఈ నెల 15, 16 (బుధవారం, గురువారం) తేదీల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.. ఇప్పటికే విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. ప్రధాని మోదీ పర్యటనతో కర్నూలు జిల్లాలో నాలుగు మండలాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు డీఈవో శామ్యూల్ పాల్‌ తెలియజేశారు. కర్నూల్ అర్బన్, రూరల్, ఓర్వకల్లు, కల్లూరు మండలాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు, అంతేకాదు ఎఫ్ఏ2 పరీక్షలు నిర్వహిస్తుండటంతో.. వాటిని కూడా వాయిదా వేశారని చెబుతున్నారు. అవి ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించాలని ఆదేశించారట. ఇటీవలే దసరా సెలవులు కూడా 13 రోజులు వచ్చాయి. అయితే తాజాగా దీపావళికి ముందే మరో రెండు రోజులు వచ్చాయి. అంతేకాదు ఆదివారం, సోమవారం కూడా సెలవు.. మధ్యలో శుక్రవారం, శనివారం మాత్రమే స్కూళ్లు ఉంటాయి.

ట్రాఫిక్ మళ్లింపులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న ఓర్వకల్లు మండలంలోని నన్నూరులో నిర్వహించనున్న సభ నేపథ్యంలో, ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలు, లారీలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఈ మార్పులు కడప, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, శ్రీశైలం, అనంతపురం, బళ్లారి వంటి నగరాల మధ్య ప్రయాణించే వాహనదారులకు వర్తిస్తాయి.

కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లేవారు పాణ్యం, గడివేముల, మిడ్తూరు, బ్రాహ్మణకొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్‌ వంతెన, అలంపూర్‌ చౌరస్తా మీదుగా వెళ్లాలి. అలాగే, కడప నుంచి కర్నూలుకు వచ్చే వాహనాలు పాణ్యం, మిడ్తూరు, నందికొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్‌ వంతెన, అలంపూర్‌ చౌరస్తా మార్గంలో ప్రయాణించాలి.

నంద్యాల నుంచి బెంగళూరు వెళ్లేవారు పాణ్యం, తమ్మరాజపల్లె, బేతంచెర్ల, డోన్‌ మీదుగా వెళ్లాలి. మరో మార్గంలో పాణ్యం, బనగానపల్లె, యన్‌.రాచర్ల, డోన్‌ మీదుగా కూడా బెంగళూరు చేరుకోవచ్చు. శ్రీశైలం నుంచి ఆత్మకూరు మీదుగా అనంతపురం వెళ్లేవారు ఆత్మకూరు, బండిఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, యన్‌.రాచర్ల, డోన్‌ మార్గంలో ప్రయాణించాలి.

ఆత్మకూరు నుంచి బళ్లారి వెళ్లే వాహనాలు ఆత్మకూరు, బ్రాహ్మణకొట్కూరు, కోల్లబాపురం, పూడూరు, అలంపూర్‌ వంతెన, అలంపూర్‌ చౌరస్తా, శాంతినగర్‌ మీదుగా వెళ్లాలి. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు గుత్తి, జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, మంత్రాలయం, మాధవరం, రాయచూర్‌ మీదుగా వెళ్లాలి. ఇంకో మార్గంలో గుత్తి, జొన్నగిరి, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం, నాగులదిన్నె, ఐజ మీదుగా కూడా హైదరాబాద్‌ చేరుకోవచ్చు. ఈ ట్రాఫిక్ మార్పులు సభ జరిగే రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయి.

అనంతపురం నుంచి నంద్యాల వైపు వెళ్లాలనుకునే వాహనదారులు అనంతపురం-ప్యాపిలి-యన్‌.రాచర్ల-బనగానపల్లె-పాణ్యం మీదుగా ప్రయాణించవచ్చు. లేదా డోన్‌-బనగానపల్లె-నంద్యాల మార్గంలో కూడా వెళ్లవచ్చు. బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్లేవారు ధనాపురంక్రాస్‌-ఆదోని-మాధవరం-రాయచూర్‌ మీదుగా వెళ్లాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఆదోని సిరిగుప్ప చెక్‌పోస్టు-ఆదోని-ఎమ్మిగనూరు-నందవరం-నాగులదిన్నె-ఐజ మీదుగా కూడా వెళ్లవచ్చు. కర్నూలు శివారులో ఉల్చాలరోడ్‌ వై జంక్షన్‌-ఎల్లూరుబంగ్లా- విష్ణుటౌన్‌షిప్‌-సంతోష్‌నగర్‌ మీదుగా కూడా ప్రయాణం సాగించవచ్చు.

‘నేను స్టూడెంట్.. నువ్వు నా టీచర్..’ నంద గోకులం విద్యార్థులతో చంద్రబాబు సరదా ముచ్చట

నంద్యాల నుంచి కర్నూలు వైపు వచ్చే వాహనాలు తమ్మరాజుపల్లె-కాల్వబుగ్గ-ఎంబాయి-రామళ్లకోట-వెల్దుర్తి మీదుగా వెళ్లాలని సూచించారు. మరో మార్గంగా తమ్మరాజుపల్లె-బేతంచెర్ల-డోన్‌ మీదుగా కూడా వెళ్లవచ్చు. ఓర్వకల్లు నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు ఓర్వకల్లు-కన్నమడకల-చౌట్కూరు-కడుమూరు- మిడ్తూరు- నందికొట్కూరు మీదుగా వెళ్లాలి. ప్రత్యామ్నాయంగా పూడిచెర్ల-కేతవరం-గార్గేయపురం-బ్రాహ్మణకొట్కూరు మీదుగా కూడా వెళ్లవచ్చని తెలిపారు. వెంకాయపల్లె ఎల్లమ్మగుడి-పడిదంపాడు- పూడూరు-ర్యాలంపాడు-అలంపూర్‌ వంతెన మీదుగా కూడా వెళ్లవచ్చని ఎస్పీ తెలిపారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి