Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026

రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాల్సిందే.. కోలీవుడ్ డిమాండ్

12 March 2026

ఉగాది నుంచి ఈ రాశులకు ఊచకోతే.. ఏడిపించనున్న గ్రహాలు.. జాగ్రత్త బాబోయ్..

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Union Bank Free Training,నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త.. కనీసం 8వ తరగతి చాలు.. ఇంటి వద్దే సంపాదన.. – union bank rural self employment training institute chandragiri free skill training to unemployed youth
ఆంధ్రప్రదేశ్

Union Bank Free Training,నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త.. కనీసం 8వ తరగతి చాలు.. ఇంటి వద్దే సంపాదన.. – union bank rural self employment training institute chandragiri free skill training to unemployed youth

.By .14 November 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Union Bank Free Training,నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త.. కనీసం 8వ తరగతి చాలు.. ఇంటి వద్దే సంపాదన.. – union bank rural self employment training institute chandragiri free skill training to unemployed youth
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ సదవకాశం కల్పిస్తోంది. యూనియన్ బ్యాంక్‌కు చెందిన గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఈ అవకాశం కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంత యువతకు వివిధ కోర్సులలో శిక్షణ అందించి.. వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ అవకాశం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువతకు మాత్రమే.. నెల రోజుల పాటు శిక్షణ అందించడంతో పాటుగా ఉచితంగా భోజన సదుపాయం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

union bank
నిరుద్యోగులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త(ఫోటోలు– TIMESOFINDIA.COM)
మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో నిరుద్యోగం ఒకటి. డిమాండ్ తక్కువ సరఫరా ఎక్కువగా ఉంటే.. వస్తువు రేటు ఎలా తగ్గిపోతుందో.. అలాగే ప్రతి ఏటా విద్యా సంస్థల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం.. అందుకు అనుగుణంగా ఉద్యోగాలు లేకపోవటంతో మన దేశంలో నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. ఇక విద్యార్థులలోనూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతుంటే.. మరికొందరు ప్రైవేట్ ఉద్యోగాలలో సర్దుకుపోతుంటారు. మరికొందరు కొలువులు దక్కక ఇబ్బందులు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివిన వారి పరిస్థితే ఇలా ఉంటే.. పదో తరగతిలోపు చదువుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇచ్చి, వారిని సొంతకాళ్లపై నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వాలతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు కూడా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువతకు యూనియన్ బ్యాంక్ సదవకాశం కల్పిస్తోంది. కనీసం ఎనిమిదో తరగతి వరకూ చదివిన వారికి కూడా అవకాశం కల్పిస్తోంది చంద్రగిరిలోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ . వివిధ అంశాలలో నిరుద్యోగ యువతకు నెల రోజుల పాటు ట్రైనింగ్ అందించి.. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ నెల రోజుల పాటు శిక్షణ అందించడంతో పాటుగా వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. మరోవైపు మహిళలు, పురుషులు ఇలా వేర్వేరుగా వివిధ కోర్సులలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ట్రైనింగ్ ఇస్తోంది. పురుషులకు సెల్ ఫోన్ సర్వీసింగ్, ఫోటో గ్రఫీ, వీడియో గ్రఫీ, బైక్ సర్వీసింగ్, ఫ్రిజ్ రిపేర్ వర్క్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, సర్వీసింగ్ , వర్మీ కంపోస్ట్, లైట్ మోటార్ వాహనాలు డ్రైవింగ్ వంటి అంశాలపై శిక్షణ అందిస్తారు.

ఇక మహిళల విషయానికి వస్తే.. బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్స్ తయారీ, టైలరింగ్, కాస్ట్యూమ్స్ జ్యువెలరీ, అగరబత్తులు, మసాలాపొడులు, అప్పడాల తయారీ, కంప్యూటర్ నెట్ వర్కింగ్ వంటి కోర్సులలో ట్రైనింగ్ అందిస్తున్నారు. నెల రోజుల పాటు ఇక్కడ శిక్షణ పొందినవారు.. ఆ తర్వాత తమ అనుభవం ఆధారంగా సొంతంగా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఇంటి వద్ద నుంచే స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు ఉన్నాయి.

మరోవైపు ఈ ట్రైనింగ్ కోసం.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. అలాగే 19 నుంచి 45 ఏళ్ల మధ్య.వయస్కులై ఉండాలి. తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలి. మరిన్ని వివరాలకు చంద్రగిరిలోని యూనియన్‌బ్యాంక్‌ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణా సంస్థను సంప్రదించాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు 79896 80587, 94949 51289, 63017 17672 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి