Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Top Folk Song: తెలుగు జానపద గేయాల్లో సంచలనం.. ఏకంగా 479 మిలియన్ల వ్యూస్..

12 February 2026

బాగా పండిన సపోటాలు తింటే ఏమవుతుందో తెలుసా ?? ఈ వీడియో తప్పక చూడండి

12 February 2026

నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు.. సొంత డబ్బులు రూ.84 లక్షలు ఖర్చు, ప్రజల కోసం – mla nandamuri balakrishna spends rs 84 lakhs own money for water plants to hindupur people

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srikakulam Lorry Driver Plan To Avoid Toll Fees,టోల్ ఫీజు కట్టకుండా లారీ డ్రైవర్ అతి తెలివి.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి – lorry driver plant escaped from toll fees in srikakulam district
ఆంధ్రప్రదేశ్

Srikakulam Lorry Driver Plan To Avoid Toll Fees,టోల్ ఫీజు కట్టకుండా లారీ డ్రైవర్ అతి తెలివి.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి – lorry driver plant escaped from toll fees in srikakulam district

.By .12 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srikakulam Lorry Driver Plan To Avoid Toll Fees,టోల్ ఫీజు కట్టకుండా లారీ డ్రైవర్ అతి తెలివి.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి – lorry driver plant escaped from toll fees in srikakulam district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Lorry Driver Plan To Avoid Toll Fees: శ్రీకాకుళం జిల్లాలో ఓ లారీ డ్రైవర్ టోల్ ఫీజు కట్టకుండా తెలివిగా వ్యవహరించాడు. లారీని మరో మార్గంలోకి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ప్లాన్ అంతా బానే ఉంది కానీ.. చివర్లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లారీ రైల్వే గేటు దగ్గర ఆగిపోయింది.. వెంటనే స్థానికులు రంగంలోకి దిగి అతి కష్టం మీద లారీని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లారు.

హైలైట్:

  • శ్రీకాకుళం జిల్లాలో లారీ డ్రైవర్ అతి తెలివి
  • టోల్ గేటు ఫీజు తప్పించుకునేందుకు ప్లాన్
  • లారీ మొరాయించడంతో సీన్ మొత్తం రివర్స్
Srikakulam Lorry Driver Toll Fees
టోల్ ఫీజు కట్టకుండా లారీ డ్రైవర్ అతి తెలివి(ఫోటోలు– Samayam Telugu)
ఓ లారీ డ్రైవర్ అతి తెలివి ప్రదర్శించాడు.. టోల్ ఫీజు చెల్లించకుండా తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. డ్యామిట్ అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.. పెద్ద సమస్యను తీసుకొచ్చి పెట్టింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వైపు వెళ్లడానికి భారీ లోడ్‌తో ఓ లారీ వచ్చింది. అయితే లక్ష్మీపురం దగ్గర టోల్‌‌గేట్‌లో ఫీజు చెల్లించకుండా తప్పించుకోవడానికి లారీ డ్రైవర్ తెలివిగా వ్యవహరించాడు. ఆ టోల్‌గేటును తప్పించుకోవచ్చని.. ఉదయం 6 గంటల సమయంలో లారీతో కాశీబుగ్గ పాత నేషనల్ హైవే మీదుగా వచ్చాడు.అక్కడ లారీ రైల్వేగేటు దాటుతున్న సమయంలో ఆగిపోయింది.. ముందుకు కదలకుండా ఎల్‌సీ గేటు దగ్గర మొరాయించింది. లారీ డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. లారీ అక్కడ ఆగిపోవడంతో రైలు గేటు వేయడానికి కూడా వీలు లేకుండాపోయింది. వెంటనే స్థానికులు అక్కడికి వచ్చారు.. కదిలించడానికి స్థానికులు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. వారంతా కలిసి ఎంతో కష్టపడి లారీని ముందుకు తోశారు. దాదపుగా గంటపాటు కష్టపడి అతికష్టంతో అక్కడ గేటును దాటించారు. టోల్ ఫీజు కట్టకుండా తప్పించుకుందామనుకుంటే ఇలా సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఆ జిల్లా దశ తిరిగింది.. 3 వేల ఎకరాల్లో టౌన్‌షిప్‌లు.. ఆ కొత్త పోర్టు దగ్గరే!

ఇదిలా ఉంటే చాలామంది లారీ డ్రైవర్లు లక్ష్మీపురం దగ్గర ఉన్న టోల్‌గేట్‌ను తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ప్రతిరోజూ కాశీబుగ్గ పాత నేషనల్ హైవే మీదుగా చాలా లారీలు వస్తున్నాయి అంటున్నారు. వాస్తవానికి పోలీసులు లారీలపై కొన్ని ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉంటుంది.. ఏవో ముఖ్యమైన కొన్ని లారీలు తప్ప, మిగిలిన లారీలు పట్టణంలోకి రావడానికి వీల్లేదు. పోలీసుల ఆంక్షలు అమల్లో ఉన్నా సరే చాలామంది పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ ఆంక్షల్ని ఎవరూ పాటించడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ లారీ వల్ల కొద్దిసేపు ఇబ్బంది ఎదురైంది. మొత్తానికి టోల్ ఫీజు కట్టుకుండా తప్పించుకునేందుకు లారీ డ్రైవర్ చేస్తున్న ఈ పనులకు పెద్ద సమస్యలే వచ్చి పడుతున్నాయని చెప్పాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి